LOADING...
Gold Rates Today: బంగారం ధరల్లో ఒక్కసారిగా పతనం.. ఎంత తగ్గిందంటే?
బంగారం ధరల్లో ఒక్కసారిగా పతనం.. ఎంత తగ్గిందంటే?

Gold Rates Today: బంగారం ధరల్లో ఒక్కసారిగా పతనం.. ఎంత తగ్గిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరల్లో గంటల వ్యవధిలోనే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం పెరిగిన రేట్లు కొన్ని గంటల్లోనే తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒక్కసారిగా ఎగిసిన ధరలు, శుక్రవారం అనూహ్యంగా క్షీణించడంతో మార్కెట్‌లో ఊహించని పరిస్థితి నెలకొంది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి కొంత ఉపశమనం లభించినట్టైంది. తాజా తగ్గింపుల తర్వాత వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,56,170 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,56,490గా ఉండగా, ఇవాళ రూ.320 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం నిన్న రూ.1,43,450 వద్ద ఉండగా, ప్రస్తుతం రూ.1,43,150కు చేరింది. అంటే ఈ వర్గంలో రూ.300 తగ్గుదల నమోదైంది.

వివరాలు 

22 క్యారెట్ల బంగారం ధర అక్కడ రూ.1,44,200

విజయవాడ,విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు అమల్లో ఉన్నాయి. అయితే చెన్నైలో మాత్రం గణనీయమైన తగ్గుదల కనిపించింది.అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.1,58,180గా ఉండగా,ఇవాళ రూ.1,57,310కు పడిపోయింది. అంటే రూ.870 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర అక్కడ రూ.1,44,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,170గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,150 వద్ద ఉంది.

వివరాలు 

కిలో వెండి ధర రూ.2.70 లక్షలు

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,320గా నమోదవగా, 22 క్యారెట్ల రేటు రూ.1,43,300 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే, ఢిల్లీలో కిలో వెండి ధర శుక్రవారం రూ.2.70 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కూడా కేజీ వెండి అదే స్థాయిలో కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా ఇదే ధర అమలులో ఉంది. నిన్న వెండి ధర రూ.20 వేలు పెరిగినా, ఇవాళ మాత్రం తగ్గుదల కనిపించింది.

Advertisement