Gold and Silver Rates: పెళ్లిళ్ల సీజన్ ముందు తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదు... అది భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి. పండుగలు, వివాహాలు, శుభకార్యాలు ఏవైనా వచ్చినా బంగారం కొనడం మన సంప్రదాయంలో భాగమే. ఇటీవల కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఊగిసలాట కనిపిస్తున్నప్పటికీ, మంగళవారం మాత్రం కొంత ఊరటనిచ్చే విధంగా మార్పులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో హైదరాబాద్ స్థానిక మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న సమయంలో ధరలు పెద్దగా పెరగకపోవడం మధ్యతరగతి వారికి కొంత ఉపశమనం కలిగిస్తోంది.
వివరాలు
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు కొద్దిగా తగ్గింది. సోమవారం ధరలతో పోలిస్తే 10 గ్రాములపై రూ.10 తగ్గి, ప్రస్తుతం రూ.1,57,410 వద్ద ఉంది. ఇదే ధర నిన్న రూ.1,57,420గా నమోదైంది. ఇక సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం కూడా స్వల్పంగా తగ్గింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.1,44,290గా ఉండగా, నిన్న రూ.1,44,300గా ఉంది. అంటే రూ.10 మేర తగ్గుదల నమోదైంది. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.2,75,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
వివరాలు
ఇతర ప్రధాన నగరాల్లో ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,57,560గా ఉంది. నిన్న ఇది రూ.1,57,570గా ఉండగా రూ.10 తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ప్రస్తుతం రూ.2,69,900గా ఉండగా, నిన్న రూ.2,70,000గా ఉంది. అంటే రూ.100 తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,470గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.10 తగ్గుదల నమోదైంది. ఇక వెండి ధర కిలోకు రూ.2,75,000గా ఉంది. ఇది కూడా నిన్నటితో పోలిస్తే రూ.100 తగ్గింది.