LOADING...
Gold and Silver Rates: మహిళలకు గుడ్‌న్యూస్ తగ్గిన బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్ తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates: మహిళలకు గుడ్‌న్యూస్ తగ్గిన బంగారం, వెండి ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళలకు శుభవార్త. రోజురోజుకూ మార్పులు చూపిస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో బంగారం రేట్లు పెరుగుతాయేమోనన్న ఆందోళనలో ఉన్న సామాన్యులకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది. కొనుగోలు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నవారికి ఈ తగ్గుదల కొంత ఊపిరి పోసింది. ఈరోజు తులం బంగారం ధర రూ.210 తగ్గింది. అయితే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

వివరాలు 

వెండి ధర..

తులం బంగారం ధర రూ.210 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,61,680 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గి ప్రస్తుతం రూ.1,21,260 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక వెండి ధర విషయానికి వస్తే, ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద అమ్ముడవుతోంది. అయితే హైదరాబాద్,చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద కొనసాగుతుండగా,ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం కిలో వెండి రూ.2,85,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement