Gold Prices: మూడు రోజుల్లో భారీ జంప్.. మళ్లీ పరుగులు తీస్తున్న బంగారం ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి రోజుల్లో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఊహించని విధంగా పెరుగుతున్నాయి. వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాల ప్రభావంతో బంగారం,వెండి ధరలకు మద్దతు లభిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత మూడు రోజులుగా బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. బుధవారం ఒక్కరోజే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర దాదాపు రూ.2,300 వరకు పెరిగింది. సోమవారం నుంచి ఇప్పటివరకు చూస్తే 10 గ్రాముల బంగారంపై రూ.3 వేలకుపైగా పెరుగుదల నమోదైంది.
వివరాలు
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,520
అదే సమయంలో వెండి కిలో ధర కూడా దాదాపు రూ.7 వేల మేర పెరిగింది. తాజాగా గురువారం కూడా బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కొనసాగింది.
పలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో నమోదైన వివరాల ప్రకారం గురువారం (జులై 24) ఉదయం 6 గంటల వరకు దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,46,520కు చేరుకుంది.
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 పెరిగి రూ.1,34,310గా నమోదైంది. వెండి కిలో ధర రూ.100 పెరిగి రూ.2,40,100కు చేరింది.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,46,520, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,34,310గా ఉన్నాయి. వెండి కిలో ధర రూ.2,45,100.
విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,46,520, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,34,310. వెండి కిలో ధర రూ.2,45,100.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,46,570, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,34,460. వెండి కిలో ధర రూ.2,40,100.
ముంబై: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,46,520, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,34,310. వెండి కిలో ధర రూ.2,40,100.
వివరాలు
నగరాల వారీగా ఎందుకు మారుతాయి ధరలు?
చెన్నై: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,46,520, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,34,310. వెండి కిలో ధర రూ.2,45,100.
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,46,520, 22క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,34,310. వెండి కిలో ధర రూ.2,40,100.
బంగారం,వెండి ధరలు దేశంలోని అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.
స్థానిక డిమాండ్,సరఫరా పరిస్థితులు,రాష్ట్రాల వారీగా అమలయ్యే పన్నులు,రవాణా వ్యయాలు,ఇతర మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి.
అందువల్ల కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతానికి సంబంధించిన తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది. బంగారం,వెండి ధరల తాజా సమాచారం తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.