Gold,Silver Price Today: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా ధరలివే..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో బంగారం,వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒక్కసారిగా పెరిగిన ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మే 18న కూడా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,56,920గా నమోదైంది. ఇవి ఉదయం 6 గంటల సమయానికి నమోదైన ధరలు మాత్రమే. రోజంతా మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో తాజా ధరలివే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,840గా కొనసాగుతోంది. విజయవాడలో కూడా 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,840గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,57,070గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,990 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,56,920గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,840గా ఉంది. చెన్నైలో మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే ధరలు ఎక్కువగా నమోదయ్యాయి.అక్కడ 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,090గా ఉండగా, 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,490గా కొనసాగుతోంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో తాజా ధరలివే..
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,840గా నమోదైంది. కోల్‌కతాలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,840గా కొనసాగుతోంది. వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,89,900గా నమోదైంది. ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.