Loading...
Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం రూ.1.64 లక్షలు!
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం రూ.1.64 లక్షలు!

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం రూ.1.64 లక్షలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

పండుగ సీజన్‌ ప్రారంభానికి ముందే బంగారం,వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెలలో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత భారం కానుంది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో రక్షాబంధన్‌తో పండుగల సీజన్‌ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వరుసగా పండుగలు, వివాహ వేడుకలు ఉంటాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండికి డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌ డిసెంబర్‌ వరకు కొనసాగే అవకాశముందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..

ఇప్పటికే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

గత వారం తులం బంగారం ధర సుమారు రూ.1.54 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.1.63 లక్షలు దాటింది.

తాజాగా ఆగస్టు 26న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740కి చేరింది.

అంటే తులం ధర దాదాపు రూ.1.64 లక్షలకు చేరువైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,009 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

దేశంలోని వివిధ నగరాలలో ధరలు 

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,890గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,240 వద్ద ట్రేడవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,009 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

దేశంలోని వివిధ నగరాలలో ధరలు

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,009 వద్ద కొనసాగుతోంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఆగస్టు 26న ఇచ్చిన వివరాల ఆధారంగా ఉన్నాయి. నగలు కొనుగోలు చేసే సమయంలో స్థానిక పన్నులు, మేకింగ్‌ ఛార్జీలు తదితర కారణాలతో తుది ధరలో మార్పు ఉండొచ్చు.

ADVERTISEMENT