LOADING...
Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా బంగారం,వెండి ధరలు ఇటీవల కొంత మేర తగ్గుదల నమోదు చేస్తున్నాయి. గత కొన్ని వారాలుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక,రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతున్నప్పటికీ, ధరల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈక్విటీ,కరెన్సీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ఒకరోజు స్థిరంగా ఉండగా,మరుసటి రోజు తగ్గుదల దిశగా కదులుతోంది. ఇటీవల తులం బంగారం ధర రూ.1.60లక్షల మార్క్‌ను తాకిన తర్వాత ప్రస్తుతం క్రమంగా దిగివస్తోంది. గుడ్ రిటర్న్స్ వెల్లడించిన వివరాల ప్రకారం,మంగళవారం ఉదయం నాటికి హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా నమోదైంది.

వివరాలు 

వివిధ రాష్ట్రాలలో బంగారం ధర ` 

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,43,190 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,340గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,190గా ఉంది. బెంగళూరులోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం బంగారం ధరలు కొంత ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,58,170 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,990గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,210, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,190 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

వెండి ధరలు 

వెండి ధరల విషయానికి వస్తే, హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,89,900గా నమోదైంది. చెన్నై, కేరళ రాష్ట్రాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే ధరలు దేశవ్యాప్తంగా ప్రామాణికంగా పరిగణించబడతాయి. అయితే ఈ ధరల్లో జీఎస్టీ చేర్చబడదు. అలాగే బంగారు ఆభరణాల కొనుగోలులో తయారీ ఛార్జీలు, ఇతర అదనపు రుసుములు విడిగా చెల్లించాల్సి ఉంటుందని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి.

Advertisement

వివరాలు 

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల

ఇక ఈ నెల తొలి ట్రేడింగ్ రోజున కూడా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ప్రారంభ ట్రేడింగ్ సమయంలో బంగారం ధరలు రూ.1,500కు పైగా క్షీణించగా, వెండి ధరలు కూడా దాదాపు అదే స్థాయిలో తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు ఇతర ఆర్థిక అంశాల ప్రభావం ఈ ధరల మార్పులకు కారణమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement