Loading...
Gold Rates: పండుగల వేళ బంగారం ధరలు డౌన్.. నేటి రేట్లు ఇవే..
పండుగల వేళ బంగారం ధరలు డౌన్.. నేటి రేట్లు ఇవే..

Gold Rates: పండుగల వేళ బంగారం ధరలు డౌన్.. నేటి రేట్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట లభించింది. కేవలం గంటల వ్యవధిలోనే ధరలు గణనీయంగా దిగివచ్చాయి. త్వరలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో చాలామంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చింది. సెప్టెంబర్ 9న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

వివరాలు 

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,54,310గా కొనసాగుతోంది.

బుధవారం ఒక్కరోజులోనే ధర రూ.1,040 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,450గా ఉంది.

ఈ రేటు కూడా నేటి మార్కెట్‌లో రూ.950 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

బెంగళూరు, చెన్నైలో ఇలా..

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,310గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,41,150 వద్ద కొనసాగుతోంది.

గత రోజు ధరలతో పోలిస్తే దాదాపు రూ.1,000 మేర తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది.

వివరాలు 

ఢిల్లీలో పసిడి ధరలు

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,680గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,710 వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510గా కొనసాగుతోంది.

22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,42,560గా ఉంది. మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి పెద్ద మార్పు కనిపించలేదు.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

తగ్గడానికి కారణాలేంటి?

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతుండటంతో బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది.

దీనికి తోడు త్వరలో పండుగలు రావడంతో పసిడి కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఉపశమనంగా మారింది.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ADVERTISEMENT