Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.710 పతనం.. నేటి తాజా రేట్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
గోల్డ్ ప్రియులకు శుభవార్త. వరుసగా మూడు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది. ఒక్కరోజులోనే పసిడి ధరలు భారీగా తగ్గాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తాజా రేట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేయడానికి ఇదే అనుకూల సమయమని పలువురు భావిస్తున్నారు. ఆగస్ట్ 14న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వివరాలు
హైదరాబాద్‌లో భారీగా తగ్గుదల
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,590గా ఉంది. శుక్రవారం ఒక్కరోజులోనే ఈ ధర రూ.710 మేర తగ్గింది.
అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది. ఈ ధర కూడా ఒక్కరోజులో రూ.650 మేర పడిపోయింది.
విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నై, బెంగళూరులో ఇలా..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,140గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,210 వద్ద కొనసాగుతోంది.
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,890గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,150 వద్ద ఉంది.
వివరాలు
ఢిల్లీలోనూ భారీ పతనం
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,040గా నమోదైంది.
ఈ ధర ఒక్కరోజులోనే రూ.710 మేర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,300గా ఉండగా.. శుక్రవారం రూ.650 మేర క్షీణించింది. ముంబైలోనూ ఢిల్లీకి సమానమైన ధరలు కొనసాగుతున్నాయి.
వివరాలు
స్థిరంగా వెండి ధరలు
బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం పెద్దగా మారలేదు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో గురువారం కిలో వెండి రూ.2.60 లక్షలు పలకగా.. శుక్రవారం రూ.2,59,900కి చేరుకుంది.
చెన్నైలోనూ కిలో వెండి ధర రూ.2,59,900గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు నగరం, మార్కెట్ పరిస్థితులు, పన్నులు, ఇతర ఛార్జీల ఆధారంగా మారవచ్చు. ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానిక జువెల్లరీ వద్ద తాజా ధరలు, మేకింగ్ ఛార్జీలు, పన్నులను తప్పనిసరిగా నిర్ధారించుకోవడం మంచిది.