LOADING...
Gold Prices: గంటల్లోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ పతనం.. తాజా రేట్లు ఇవే
ఒక్కసారిగా భారీ పతనం.. తాజా రేట్లు ఇవే

Gold Prices: గంటల్లోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ పతనం.. తాజా రేట్లు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం ఒక స్థాయిలో ఉన్న ధరలు మార్కెట్లు ప్రారంభమైన వెంటనే మారిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ పతనం ఈ వారం కూడా అలాగే కొనసాగుతోంది. సోమవారం ప్రారంభమైన తగ్గుదల మంగళవారం మరింత వేగం పుంజుకుంది. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు రూ.1.50 లక్ష దిగువకు చేరడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర 1,49,180 రూపాయల వద్ద ఉంది. నిన్న ఇది 1,49,620 రూపాయలుగా ఉండగా,ఈరోజు రూ.440 తగ్గింది. ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1,37,150గా ఉండగా, రూ.400 తగ్గుదల నమోదైంది.

వివరాలు 

వివిధ పట్టణాలలో బంగారం ధరలు 

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,770గా ఉండగా, నిన్న రూ. 1,52,730గా ఉంది. దాదాపు రూ. 1,960 తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్ల ధర రూ. 1,38,200 వద్ద ఉంది. నిన్న ఇది రూ. 1,40,000 స్థాయిలో ఉండగా, ఈరోజు రూ. 1,800 తగ్గింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,180గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,36,750గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,230 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల ధర రూ. 1,36,900గా ఉంది.

వివరాలు 

వెండి ధరలు

వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2,55,000గా ఉంది. నిన్న ఇది రూ. 2,65,000గా ఉండగా, ఈరోజు రూ. 10,000 భారీ తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతుండగా, నిన్న రూ. 2,70,000గా ఉంది. చెన్నైలో కూడా వెండి ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతోంది.

Advertisement