Loading...
Gold Rates: ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. పసిడిపై రూ.5,300 కోత!
ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. పసిడిపై రూ.5,300 కోత!

Gold Rates: ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. పసిడిపై రూ.5,300 కోత!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌ మార్కెట్లో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1.30 లక్షల దిగువకు చేరింది. క్రితం రోజు ముగింపు ధర రూ.1.33 లక్షలతో పోలిస్తే ఏకంగా రూ.5,300 తగ్గి రూ.1,27,900 వద్దకు దిగొచ్చింది. ఒక్కరోజు వ్యవధిలోనే పసిడి ధర ఈ స్థాయిలో పడిపోవడం గమనార్హం. వెండి ధర కూడా ఇదే బాటలో భారీగా తగ్గింది. హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,54,680గా నమోదైంది. క్రితం రోజు కిలో వెండి ధర రూ.1.65 లక్షలుగా ఉండగా.. తాజాగా దాదాపు రూ.10వేలకు పైగా తగ్గింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లోనూ తగ్గిన బంగారం ధరలు

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి.

స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు ధర 3,546 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గత కొంతకాలంగా 4వేల డాలర్లకు పైన ఉన్న పసిడి ధర.. కొద్ది రోజుల వ్యవధిలోనే 500 డాలర్లకు పైగా తగ్గడం విశేషం.

స్పాట్‌ వెండి ఔన్సు ధర 41.84 డాలర్లుగా ఉంది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ డిసెంబరు డెలివరీకి సంబంధించి 10 గ్రాముల ధర రూ.1.22 లక్షలుగా, కిలో వెండి ధర రూ.1.49 లక్షలుగా కొనసాగుతోంది.

వివరాలు 

బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలివే..

సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం లావాదేవీలు అమెరికా డాలర్లలో జరుగుతుంటాయి.

ప్రస్తుతం డాలర్‌ విలువ బలపడటంతో ఇతర దేశాల కొనుగోలుదారులకు బంగారం కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది.

దీంతో పసిడికి డిమాండ్‌ తగ్గే పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు అమెరికా ట్రెజరీ బాండ్లపై వచ్చే ప్రతిఫలం పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం నుంచి బాండ్ల వైపు మళ్లిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలివే..

అంతేకాకుండా అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా నమోదవడం, ఆర్థిక గణాంకాలు బలంగా ఉండటం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో డిసెంబరులో ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి.

డాలర్‌ బలోపేతం, ట్రెజరీ బాండ్లపై పెరుగుతున్న ప్రతిఫలం, వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు.. ఈ అంశాలన్నీ కలిసి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనానికి కారణమవుతున్నాయి.

ADVERTISEMENT