Gold,Silver Prices: స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ప్రస్తుతం కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్లైంది. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు,ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజా వివరాల ప్రకారం సోమవారం ఉదయం హైదరాబాద్,విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,050గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,45,790గా ఉంది.
వివరాలు
వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,200గా ఉండగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,45,940గా కొనసాగుతోంది.
ఇక వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది.
కిలో వెండిపై వంద రూపాయల మేర తగ్గింపు కనిపించింది.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,94,900గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,84,900గా కొనసాగుతోంది.
అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,94,900గా ఉండగా.. బెంగళూరులో రూ.2,84,900గా నమోదైంది.
బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తరచూ మారుతూ ఉంటాయి.
అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.