LOADING...
Gold Prices: బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. కొనాలా? వద్దా? నిపుణులు చెబుతున్న కీలక సూచనలు ఇవే..
నిపుణులు చెబుతున్న కీలక సూచనలు ఇవే..

Gold Prices: బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. కొనాలా? వద్దా? నిపుణులు చెబుతున్న కీలక సూచనలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.61 లక్షలకు చేరగా.. వెండి ధర కిలోకు దాదాపు రూ.3 లక్షలకు చేరువైంది. భారత్‌లో బంగారం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడటంతో.. సుంకం పెంపు ప్రభావం నేరుగా నగల ధరలపై పడనుంది. దీంతో సాధారణ వినియోగదారులపై భారమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం 

గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే గోల్డ్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన వారు తమ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఇదే సరైన సమయమని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఈఓ విశాల్ ధావన్ సూచించారు. మరోవైపు గోల్డ్‌లో తక్కువ పెట్టుబడి ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా, దశలవారీగా పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. దిగుమతి సుంకం పెంపుతో దేశీయంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

అక్రమ రవాణా,గ్రే మార్కెట్ పెరిగే ప్రమాదం

ఇక ఈ నిర్ణయంతో జ్యువెలరీ కంపెనీల షేర్లపై కూడా ప్రభావం పడింది. స్కై గోల్డ్ షేర్లు 11 శాతానికి పైగా పడిపోగా.. కస్కై గోల్డ్ షేర్లు 11శాతానికి పైగా క్షీణించగా.. కళ్యాణ్ జ్యువెలర్స్,సెన్కో గోల్డ్, టైటాన్ కంపెనీ వంటి జ్యువెలరీ కంపెనీల షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. మరోవైపు ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరిగాయి. జ్యువెలరీ రంగం మాత్రం ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిగుమతి సుంకం పెరగడంతో అక్రమ రవాణా,గ్రే మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ హెచ్చరించింది. బంగారం ధరలు పెరగడంతో వినియోగదారులు తక్కువ గ్రాముల ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement