Gold Prices: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది అంతగా ఊరటనిచ్చే వార్త కాదు. వివాహాల సీజన్ తిరిగి ప్రారంభం కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. కొనుగోలుదారుల సంఖ్య అధికమవడంతో మార్కెట్లో విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఇటీవల వరుస రోజుల పాటు తగ్గిన ధరలు, గత రెండు రోజులుగా మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
వివరాలు
పెరిగిన ధరలు ఇవే..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,950కు చేరుకుంది. ఒక్కరోజులోనే ఈ ధర రూ.1,200 మేర పెరిగింది. అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,950గా నమోదైంది. ఇందులో శనివారం ఒక్కరోజే రూ.1,100 పెరుగుదల కనిపించింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు అమల్లో ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860గా ఉండగా, నేడు రూ.770 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,700కు చేరగా, ఇందులో రూ.700 పెరుగుదల నమోదైంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,950గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,950గా ట్రేడవుతోంది.
వివరాలు
ఏ నగరాల్లో ఎంత ధర ఉందంటే..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,400గా నమోదైంది. శనివారం ఒక్కరోజే ఈ ధర రూ.1,150 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,100గా ఉండగా, ఇందులో రూ.1,050 మేర పెరుగుదల నమోదైంది. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,950గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా కొనసాగుతోంది. చెన్నైలో కూడా ఇదే ధర నమోదైంది. బెంగళూరులో కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతుండగా, ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.2.40 లక్షలుగానే కొనసాగుతోంది.