Gold Silver Prices Today : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగకు ముందు బంగారం,వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. కొద్ది రోజుల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షల వరకు చేరగా.. ప్రస్తుతం రూ.1.39 లక్షల స్థాయిలో కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, సౌదీ-హౌతీల మధ్య ఘర్షణలు వంటి పరిణామాలు బులియన్ మార్కెట్లో మార్పులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే, మంగళవారం నుంచి పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.
వివరాలు
బంగారం, వెండి ధరలు
పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. నవంబర్ 4, బుధవారం ఉదయం 6 గంటల సమయానికి దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,39,650కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,28,010గా నమోదైంది.
మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,99,900కు చేరింది.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,39,650గా ఉంది. 22క్యారెట్ల పసిడి ధర రూ.1,28,010గా నమోదైంది. వెండి కిలో ధర రూ.1,99,900గా కొనసాగుతోంది.
విజయవాడలోనూ బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,650 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,010గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,39,800గా ఉంది. 22క్యారెట్ల పసిడి ధర రూ.1,28,160గా నమోదైంది. వెండి కిలో ధర రూ.1,99,900గా కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,39,650గా ఉంది. 22క్యారెట్ల ధర రూ.1,28,010గా నమోదైంది. వెండి కిలో ధర రూ.1,99,900గా ఉంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
చెన్నైలోనూ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,39,650గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,010గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900గా కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,39,650గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,28,010గా నమోదైంది. వెండి కిలో ధర రూ.1,99,900గా ఉంది.
వివరాలు
నగరాల వారీగా ధరల్లో ఎందుకు వ్యత్యాసం?
బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానికంగా ఉండే డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు తదితర అంశాల ఆధారంగా ధరలు మారుతుంటాయి.
అందువల్ల దేశంలోని ప్రధాన నగరాల్లోనూ పసిడి, వెండి ధరల్లో తేడాలు కనిపిస్తాయి.
బంగారం, వెండి ధరల తాజా వివరాలు తెలుసుకోవాలనుకునేవారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.