Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. వరుసగా మారుతున్న బంగారం ధరలు ఆగస్ట్ 21న ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతకుముందు రోజు హైదరాబాద్, ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో గోల్డ్ రేట్లు తగ్గగా.. శుక్రవారం ఉదయం మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వెయ్యి, రెండు వేల రూపాయలు కాదు.. ఏకంగా రూ.4 వేల వరకు ధర పెరగడం గమనార్హం. ఇటీవల అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ పెరగడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలపై ఒత్తిడి ఏర్పడింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారడంతో గోల్డ్‌తో పాటు సిల్వర్ రేట్లు కూడా మళ్లీ పైకి కదిలాయి.
వివరాలు
హైదరాబాద్‌లో బంగారం,వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,150గా ఉంది.
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,59,420గా కొనసాగుతోంది.
ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,46,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,270గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం బంగారం,వెండి ధరలు భారీగా పెరిగాయి.
ఆగస్ట్ 21న ఉదయం 7 గంటల సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,950 పెరిగింది.
దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,000కు చేరింది. అంతకుముందు రోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 తగ్గింది.
వివరాలు
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 10 గ్రాములపై రూ.4,300 పెరగడంతో ప్రస్తుతం రూ.1,59,270 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. అంతకుముందు రోజు కిలో వెండి ధర రూ.5 వేల మేర తగ్గగా.. ఆగస్ట్ 21న ఏకంగా రూ.10 వేల పెరుగుదల నమోదైంది.
దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.60 లక్షలకు చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరాల్లో రేట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి.
విజయవాడ, అమరావతి, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,000గా ఉంది.
24 క్యారెట్ల మేలిమి పుత్తడి ధర రూ.1,59,270గా కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రధాన నగరాల్లో కిలో సిల్వర్ ధర సుమారు రూ.2.60 లక్షల స్థాయిలో ఉంది.
వివరాలు
బంగారం ధరలు ఎందుకు పెరిగాయి?
అమెరికా బాండ్ ఈల్డ్స్ 2007 తర్వాత నమోదైన గరిష్ఠ స్థాయిల నుంచి ఒక్కసారిగా దిగిరావడంతో యూఎస్ డాలర్ విలువ కూడా తగ్గింది.
సాధారణంగా డాలర్ బలహీనపడినప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పైకి కదిలాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,530 డాలర్ల మార్కును దాటి ట్రేడవుతోంది.
అదే సమయంలో సిల్వర్ ధర కూడా ఔన్సుకు 69 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో నమోదవుతున్న ఈ మార్పుల ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడుతోంది.
వివరాలు
భారత్‌లో బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలివే..
దేశీయంగా బంగారం, వెండి ధరలపై అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ప్రధాన ప్రభావం చూపిస్తాయి.
వీటితో పాటు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో వచ్చే మార్పులు, ద్రవ్యోల్బణం, పండగల సమయంలో పెరిగే డిమాండ్, పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోళ్లు, ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాలు వంటి అంశాలు కూడా గోల్డ్, సిల్వర్ ధరలను ప్రభావితం చేస్తాయి.
అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకునే మార్పులు దేశీయ బులియన్ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతుంటాయి.
డాలర్, బాండ్ ఈల్డ్స్, అంతర్జాతీయ బంగారం-వెండి ధరల్లో మార్పులను బట్టి భారత్‌లోనూ పసిడి, వెండి రేట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.