Gold Price Today: బంగారం ధరల్లో మళ్లీ భారీ పెరుగుదల.. కొనుగోలుదారులకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం,వెండి ధరలు మరోసారి దిశ మార్చుకున్నాయి. ఇటీవలి రోజుల్లో వరుసగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి షాక్ ఇస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా నిన్న ఒక్కరోజే బంగారం ధర భారీగా పెరగడం కొనుగోలు దారుల్లో ఆందోళనకు కారణమైంది. తులం బంగారంపై సుమారు రూ.3 వేలకుపైగా పెరుగుదల నమోదైంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. సెప్టెంబర్ 4న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,520గా నమోదైంది.
వివరాలు
వివిధ నగరాలలో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,410గా కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,16,520 వద్ద ఉంది.
విజయవాడలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,520గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,55,510గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,560గా కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,16,670 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
వివిధ నగరాలలో బంగారం ధరలు
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,520గా నమోదైంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,16,520గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. అయితే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,110గా ఉంది.
వివరాలు
వెండి ధర ఎంతంటే..
వెండి ధర విషయానికి వస్తే.. కిలోకు రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. బంగారం ధరతో పోలిస్తే వెండి కొంత ఊరటనిస్తోంది.
ప్రస్తుతం వెండి ధరలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. పసిడి, వెండి కొనుగోలు చేసే వారు ఆయా నగరాల్లోని తాజా మార్కెట్ ధరలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.