Loading...
Gold Prices: బంగారం కొనేవారికి భారీ షాక్.. వరుసగా రెండో రోజూ పెరిగిన పసిడి ధరలు
బంగారం కొనేవారికి భారీ షాక్.. వరుసగా రెండో రోజూ పెరిగిన పసిడి ధరలు

Gold Prices: బంగారం కొనేవారికి భారీ షాక్.. వరుసగా రెండో రోజూ పెరిగిన పసిడి ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. మంగళవారం రూ.3 వేలకుపైగా పెరిగిన పసిడి రేట్లు.. బుధవారం కూడా మరోసారి పైకి ఎగబాకాయి. ఒక్కరోజులోనే రూ.వెయ్యికిపైగా పెరుగుదల నమోదైంది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు ఈ పరిణామం బలం చేకూరుస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ దాడులు ప్రారంభం కావడం, డాలర్ విలువలో మార్పులు, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. వీటికి తోడు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా పసిడి రేట్ల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

వివరాలు 

శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,54,860గా ఉంది.

బుధవారం ఒక్కరోజే ఈ రేటు రూ.1,040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,950కి చేరింది.

ఈ రేటు కూడా నేడు రూ.950 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా సమీపిస్తోంది. ఈ సమయంలో పసిడి ధరలు పెరుగుతుండటం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రతికూల పరిణామంగా మారింది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,380 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,41,358గా ఉంది.

వివరాలు 

వెండి ధరలు 

బెంగళూరులో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,860గా ఉండగా.. 22క్యారెట్ల రేటు రూ.1,41,950 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.24క్యారెట్ల పసిడి ధర రూ.1,55,010గా ఉంది.

బుధవారం ఒక్కరోజే రూ.1,040 పెరిగింది. 22క్యారెట్ల బంగారం ధర రూ.1,42,100గా ఉండగా.. నేడు రూ.950 పెరిగింది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,860గా కొనసాగుతోంది. 22క్యారెట్ల పసిడి రేటు రూ.1,41,950 వద్ద ఉంది.

వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు.దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ముంబైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ.2.60లక్షల వద్ద కొనసాగుతోంది.

చెన్నైలోనూ కిలో వెండి ధర రూ.2.60 లక్షలుగా ఉంది.

ADVERTISEMENT