Loading...
Gold Prices Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా రేట్లు ఇవే..
బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా రేట్లు ఇవే..

Gold Prices Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా రేట్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక అనిశ్చితి కారణంగా బంగారం,వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం పెరిగిన ధరలు గురువారం స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగించాయి. జులై 17 శుక్రవారం ఉదయం 6 గంటల వరకు వివిధ బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో నమోదైన వివరాల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,43,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 తగ్గి రూ.1,31,340గా నమోదైంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం,వెండి ధరలు

ఇక వెండి ధర కూడా తగ్గుముఖం పట్టగా, కిలోకు రూ.100 తగ్గి రూ.2,34,900గా కొనసాగుతోంది.

అయితే బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్,సరఫరా,రవాణా వ్యయం,రాష్ట్ర పన్నులు వంటి అంశాల ప్రభావంతో నగరాలవారీగా ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తాయి.

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,280 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,340 వెండి (కిలో): రూ.2,39,900

విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,280 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,340 వెండి (కిలో): రూ.2,39,900

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,430 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,490 వెండి (కిలో): రూ.2,34,900

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం,వెండి ధరలు

ముంబై:24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,280 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,340 వెండి (కిలో): రూ.2,34,900

చెన్నై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,450 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,490 వెండి (కిలో): రూ.2,39,900

బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,280 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,340 వెండి (కిలో): రూ.2,34,900

బంగారం, వెండి ధరలు రోజువారీగా మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకం విలువ, స్థానిక డిమాండ్, దిగుమతి సుంకాలు, రాష్ట్రాల పన్నులు వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉండటం సహజం.

ADVERTISEMENT