LOADING...
Gold Price Today: స్థిరంగా బంగారం,వెండి ధరలు.. మార్కెట్‌లో స్వల్ప మార్పులు
స్థిరంగా బంగారం,వెండి ధరలు.. మార్కెట్‌లో స్వల్ప మార్పులు

Gold Price Today: స్థిరంగా బంగారం,వెండి ధరలు.. మార్కెట్‌లో స్వల్ప మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఈ విలువైన లోహాల ధరల్లో ఊగిసలాట కనిపించినప్పటికీ.. బుధవారం ఉదయం వరకు మాత్రం పెద్దగా మార్పులు నమోదుకాలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. మే 20 బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,57,050గా నమోదైంది. అదే సమయంలో కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ధరలతో పోలిస్తే బంగారం ధరపై రూ.10 పెరగ్గా, వెండి ధర కిలోకు రూ.100 తగ్గింది.

వివరాలు 

వివిధ పట్టణాలలో బంగారం ధరలు 

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,960 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,200గా నమోదైంది.అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,110గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,57,050 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,960గా కొనసాగుతోంది.బెంగళూరులో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి. చెన్నైలో మాత్రం బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,62,230గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,710 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

వెండి ధరలు

కోల్‌కతా, కేరళలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,960 వద్ద నమోదైంది. వెండి ధరల విషయానికి వస్తే దేశీయ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,84,900గా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర రూ.2,99,900గా నమోదైంది. ఇక్కడ పేర్కొన్న ధరలు బుధవారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన సగటు మార్కెట్ ధరలు మాత్రమే. రోజు పొడవునా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు స్థానిక ఆభరణాల దుకాణాల్లో తాజా ధరలు తెలుసుకోవడం మంచిది.

Advertisement