బంగార ధర ఎందుకు పెరుగుతోంది? కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మనదేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే గతకొన్ని రోజులుగా బంగార ధర పెరుగుతూ పోతుంది. ఈ మధ్యనే 10గ్రాముల బంగారం ధర 60వేల మార్కును చేరుకుంది. మరి బంగారం ధర ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ద్రవ్యోల్బణం (ధరలు) పెరిగినపుడు ఆ ప్రభావం బంగారం మీద పడుతుంది. అమాంతం బంగారం ధర కూడా పెరిగిపోతుంది. భారతదేశ రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం రేటు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. మార్కెట్లో అస్థిరతలు ఉన్నట్లయితే బంగారం ధర కొండెక్కుతుంది. ఒకవేళ రూపాయి విలువ పెరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
డిమాండ్ పెరిగితే రేటు పెరుగుతుంది
సాధారణంగా ఏ వస్తువు ధర అయినా, డిమాండ్ పెరిగితే రేటు పెరుగుతుంది. బంగారం కూడా క్యాటగిరీలోకి వస్తుంది. మన దేశం విదేశాల నుండి బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. బంగారం రేటు పెరగడానికి దిగుమతి కుడా ఓ కారణమే. ఇక మరో కారణం ఏంటంటే, బంగారం కోసం అటు చైనా, రష్యా దేశాల నుండి పోటీ వస్తోంది. అందుకే ప్రస్తుతం రేటు పెరుగుతుందని నిపుణుల వాదన. మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ పెరుగుదల ఎప్పటి దాకా ఉంటుందో, రానున్న రోజుల్లో బంగారం ఇంకెంత ప్రియం అవుతుందో చూడాలి.