Loading...
Gold Price: బంగారం ధరలకు బ్రేక్.. తగ్గిన పసిడి రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
బంగారం ధరలకు బ్రేక్.. తగ్గిన పసిడి రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Price: బంగారం ధరలకు బ్రేక్.. తగ్గిన పసిడి రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పసిడి రేట్లు భారీగా పెరుగుతుండటంతో ఆందోళన చెందిన వినియోగదారులకు ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. ఇటీవల పది రోజుల్లోనే బంగారం ధరలు దాదాపు రూ.4 వేల వరకు పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాల కారణంగా గోల్డ్ మార్కెట్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు పసిడి ధరల కదలికలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.

వివరాలు 

దేశీయంగా బంగారం,వెండి ధరలు

కొన్ని మార్కెట్ రేట్ల ప్రకారం పసిడి ధరలు సుమారు రూ.700 వరకు తగ్గినట్లు నమోదైంది.

పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా ఆగస్టు 20 గురువారం ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,54,960కి చేరింది.

22 క్యారెట్ల బంగారం ధర

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,42,040గా నమోదైంది.

వెండి ధర

వెండి కిలో ధర రూ.100 తగ్గి రూ.2,44,900గా కొనసాగుతోంది.

వివరాలు 

నగరాల వారీగా ధరల్లో తేడా

బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్,సరఫరా, రాష్ట్రాల పన్నులు, ఇతర స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి.

అందువల్ల ప్రధాన నగరాల్లోనూ పసిడి, వెండి ధరలు స్వల్పంగా వేర్వేరుగా నమోదవుతుంటాయి.

హైదరాబాద్‌లో బంగారం,వెండి ధరలు

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,960గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,040గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,49,900గా కొనసాగుతోంది.

విజయవాడ,విశాఖపట్నంలో రేట్లు

విజయవాడ,విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,960గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,040గా నమోదైంది. ఈ రెండు నగరాల్లో వెండి కిలో ధర రూ.2,49,900గా ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ఢిల్లీలో బంగారం, వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,55,110గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,190గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,44,900గా కొనసాగుతోంది.

ముంబైలో పసిడి ధరలు

ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,960గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,040గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,44,900గా ఉంది.

చెన్నైలో గోల్డ్ రేట్లు

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,960గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,42,040గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,44,900గా కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

బెంగళూరులో బంగారం ధరలు

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,960గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,040గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,44,900గా కొనసాగుతోంది.

ధరల్లో ఎందుకు వ్యత్యాసం?

బంగారం, వెండి రేట్లు దేశంలోని అన్ని నగరాల్లో ఒకేలా ఉండవు. స్థానికంగా ఉన్న డిమాండ్, సరఫరా పరిస్థితులు, రాష్ట్ర పన్నులు, ఇతర మార్కెట్ అంశాలను బట్టి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.

అందుకే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో రేట్లలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి.

బంగారం, వెండి ధరల తాజా అప్‌డేట్లను తెలుసుకోవాలనుకునేవారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సమాచారం.

ADVERTISEMENT