Gold Silver Prices Today : వరుసగా రెండోరోజూ పెరిగిన బంగారం ధర.. నేటి గోల్డ్ రేట్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత భారంగా మారింది. మంగళవారం ఉదయం మార్కెట్‌లో నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270, 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగింది. సోమ, మంగళవారాల్లో కలిపి 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.750 పెరిగింది. ఈ వారంలో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. ఔన్సు బంగారంపై 20 డాలర్లు తగ్గడంతో ప్రస్తుతం 3,929 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.
వివరాలు
ప్రధాన నగరాలలో బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,640గా ఉంది.
అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,000 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,790గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,150 వద్ద ఉంది.
ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,640కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,000 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
వెండి ధరలు
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.2,00,000గా ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.2,00,000కు చేరింది. చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మంగళవారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైనవి మాత్రమే. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు.