Gold and Silver Rates: ఉద్రిక్తతల మధ్య బంగారం స్థిరం.. స్వల్పంగా తగ్గిన వెండి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు,కాల్పుల విరమణ ఒప్పందంపై ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు కొంతమేర బంగారం వైపు మళ్లుతున్నారు. అంతేకాకుండా,అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో చోటుచేసుకునే మార్పులు నేరుగా పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ 10, 2026 నాటి బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం బంగారం,వెండి ధరలు మిశ్రమ ధోరణి చూపుతున్నాయి. ఈరోజు వెండి ధరలు కొద్దిగా తగ్గగా, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
వివరాలు
దేశంలోని ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ( 10 గ్రాములు) ఉన్నాయి:
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని కీలక నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,470గా నమోదైంది. నిన్నటి ధర రూ. 1,51,480తో పోలిస్తే రూ. 10 మేర తగ్గుదల కనిపించింది. హైదరాబాద్: రూ.1,51,470 విజయవాడ: రూ.1,51,480 విశాఖపట్నం: రూ.1,51,480 ముంబై: రూ.1,51,470 బెంగళూరు: రూ.1,51,470 ఢిల్లీ: రూ.1,51,620 చెన్నై: రూ.1,52,720 కేరళ: రూ. 1,51, 470 ఇక వెండి కిలో రూ. 2,59,900 గా ఉంది.