Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం రెండో భాగంలో గణనీయంగా పెరిగిన బంగారం,వెండి ధరలు ఈ వారం ప్రారంభంలోనూ అదే ఊపును కొనసాగిస్తున్నాయి. సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్‌లో బంగారం ధర ఏకంగా రూ.2 వేల వరకు ఎగిసింది. ఇప్పటికే గత వారం మొత్తం మీద పసిడి ధర దాదాపు రూ.4,300 మేర పెరిగిన విషయం తెలిసిందే. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,360గా నమోదైంది. ఇది నిన్న ఇదే సమయంతో పోల్చితే రూ.2,080 పెరుగుదలగా ఉంది. అలాగే 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,910 పెరిగి రూ.1,47,910కు చేరుకుంది.
వివరాలు
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. పసిడి,వెండి డిమాండ్
వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఒక్కసారిగా రూ.10 వేల వరకు ఎగిసి రూ.3,00,100 స్థాయిని తాకాయి (ఫిబ్రవరి 24 నాటి బంగారం, వెండి ధరలు).
సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.
అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ 15 శాతం సుంకం విధించడంతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
దీనివల్ల డాలర్ విలువ తగ్గి, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నారు.
అంతేకాక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా పసిడి, వెండి డిమాండ్‌ను నిలకడగా ఉంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,62,120; ₹1,48,610
ముంబై: ₹1,61,360; ₹1,47,910
ఢిల్లీ: ₹1,61,510; ₹1,48,060
కొలకతా: ₹1,61,360; ₹1,47,910
బెంగళూరు: ₹1,61,360; ₹1,47,910
హైదరాబాద్: ₹1,61,360; ₹1,47,910
విజయవాడ: ₹1,61,360; ₹1,47,910
కేరళ: ₹1,61,360; ₹1,47,910
పుణే: ₹1,61,360; ₹1,47,910
వడోదరా: ₹1,61,410; ₹1,47,960
అహ్మదాబాద్: ₹1,61,410; ₹1,47,960
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹3,01,100
ముంబై: ₹2,99,100
ఢిల్లీ: ₹3,00,000
కొలకతా: ₹3,00,000
బెంగళూరు: ₹3,00,100
హైదరాబాద్: ₹3,00,100
విజయవాడ: ₹3,00,100
కేరళ: ₹3,00,000
పుణే: ₹2,99,000
వడోదరా: ₹3,00,100
అహ్మదాబాద్: ₹3,00,000