EPFO 74th Foundation Day: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై PFకు సంబంధించిన సేవల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త డిజిటల్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది. నేరుగా వాట్సాప్ ద్వారానే PFకు సంబంధించిన పలు సేవలను పొందే అవకాశం కల్పించనుంది. అంతేకాకుండా, ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయకుండా పాత ఖాతాల్లోనే ఉండిపోయిన చిన్న మొత్తాలను కూడా ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే విధానాన్ని తీసుకొస్తోంది. 2026 నవంబర్ 1న జరిగిన EPFO 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రెండు కీలక డిజిటల్ సదుపాయాలను ప్రకటించినట్లు సమాచారం.
వివరాలు
ఇక వాట్సాప్‌లోనే EPFO సేవలు
ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి.
ఇప్పటివరకు PF బ్యాలెన్స్ తెలుసుకోవాలన్నా, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయాలన్నా ఉద్యోగులు EPFO పోర్టల్ లేదా UMANG యాప్ వంటి డిజిటల్ సేవలను ఉపయోగించాల్సి వచ్చేది.
అయితే కొత్తగా అందుబాటులోకి రానున్న వాట్సాప్ సేవలతో ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది. వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపడం ద్వారా EPFO సేవలను పొందే సదుపాయాన్ని కల్పించనున్నారు.
దీని ద్వారా ఉద్యోగులు తమ PF ఖాతాకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
ఇందుకోసం EPFO త్వరలోనే ప్రత్యేక అధికారిక వాట్సాప్ నంబర్‌ను ప్రకటించనుంది.
వివరాలు
వాట్సాప్ ద్వారా పొందగలిగే PF సేవలు ఇవే..
కొత్త వాట్సాప్ సదుపాయం ద్వారా ఉద్యోగులు పలు రకాల PF సేవలను వినియోగించుకోవచ్చు.
PF బ్యాలెన్స్ చెకింగ్: మీ PF ఖాతాలో ప్రస్తుతం ఎంత మొత్తం ఉందో వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చు.
EPF పాస్‌బుక్ డౌన్‌లోడ్: PF ఖాతాకు సంబంధించిన పాస్‌బుక్‌ను వాట్సాప్ ద్వారా పొందవచ్చు.
UAN స్టేటస్: మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివ్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.
e-KYC స్టేటస్: PF ఖాతాకు సంబంధించి మీ KYC వివరాల ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు.
క్లెయిమ్ స్టేటస్: మీరు సమర్పించిన PF విత్‌డ్రాయల్ లేదా ఇతర క్లెయిమ్‌లు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవచ్చు.