Page Loader
Gold Rate: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ధరలు
బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ధరలు

Gold Rate: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ధరలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 29, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,419గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,549గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 1,14,200గా ఉంది. అమరావతి (విజయవాడ)లో కూడా ధరలు స్వల్పంగా భిన్నంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,425గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,555గా ఉంది. అక్కడ కేజీ వెండి ధర మాత్రం రూ. 1,15,000గా నమోదైంది. ఇక విశాఖపట్నంలోనూ ఇదే స్థాయిలో రేట్లు కొనసాగుతున్నాయి. అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,427 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 97,557గా ఉంది.

Details

కేజీ వెండి ధర రూ.1,02,500

100 గ్రాముల వెండి ధర రూ. 11,260గా ఉంది. బెంగళూరు మార్కెట్‌పై గమనిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరలు రూ. 89,405గా, 24 క్యారెట్ల ధరలు రూ. 97,535గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి ధర రూ. 10,290గా ఉండగా, కేజీ వెండి ధర రూ. 1,02,500గా నమోదైంది. పసిడి, వెండి ధరల పెరుగుదలకు కారణాలుగా ట్రంప్‌ టారీఫ్‌ ప్రభావం, ఫెడ్‌ వడ్డీ రేట్ల మార్పులు, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ వడ్డీ రేట్ల కోత వంటి ఆర్థిక అంశాలను నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ రేట్లలో ట్యాక్స్‌లు గణనలోకి తీసుకోలేదని కూడా స్పష్టంగా పేర్కొన్నారు.