Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం ధర.. 10 గ్రాముల రేటు ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. వినాయక చతుర్థి పండగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.49 తగ్గి రూ.15,409కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.45 తగ్గి రూ.14,125గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.37 తగ్గి రూ.11,557కు చేరుకుంది.
వివరాలు
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,54,090గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములపై రూ.490 తగ్గింది.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,250గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములపై రూ.450 తగ్గింది.
ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,15,570గా ఉంది. ఇది 10 గ్రాములపై రూ.370 తగ్గింది.
హైదరాబాద్‌లో వెండి ధర
బంగారం ధరలు తగ్గినప్పటికీ హైదరాబాద్‌లో వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.250గా ఉంది. 10 గ్రాముల వెండి రూ.2,500, 100 గ్రాముల వెండి రూ.25,000గా ఉంది. కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
వివరాలు
ఢిల్లీలోనూ తగ్గిన బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,424గా ఉంది.
10గ్రాముల ధర రూ.1,54,240గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములపై రూ.490 తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,140గా ఉంది.
10గ్రాముల ధర రూ.1,41,400గా కొనసాగుతోంది. 18క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.11,572గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ.1,15,720గా ఉంది.
ఢిల్లీలో వెండి ధరలు స్థిరం
ఢిల్లీలో కూడా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గ్రాము వెండి ధర రూ.245గా ఉంది. 10 గ్రాముల ధర రూ.2,450, 100 గ్రాముల ధర రూ.24,500గా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.