Gold and Silver Prices: ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం.. స్థిరంగా బంగారం,వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం కారణంగా పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం,వెండి ధరలు ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం వ్యాపార ముగింపు సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,59,390 రూపాయలుగా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,46,110 రూపాయలకు, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,19,550 రూపాయలకు విక్రయమైంది.
వివరాలు
వెండి ధరలు
మంగళవారం ఉదయం కూడా బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు.
గుడ్‌రిటర్న్స్ సమాచారం ప్రకారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,59,390 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అలాగే 22 క్యారెట్ల బంగారం 1,46,110 రూపాయలు,18 క్యారెట్ల బంగారం 1,19,550 రూపాయల వద్ద నమోదైంది.
ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల వెండి ధర 29,490 రూపాయలుగా ఉండగా, కిలో వెండి 2,94,900 రూపాయల వద్ద నమోదైంది.
మంగళవారం ఉదయం కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల వెండి 29,490 రూపాయలు, కిలో వెండి 2,94,900 రూపాయల వద్ద వ్యాపారం సాగుతోంది.
వివరాలు
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,59,390
విజయవాడ: రూ.1,59,390
విశాఖపట్నం: రూ.1,59,390
ముంబై: రూ.1,59,390
బెంగళూరు: రూ.1,59,390
ఢిల్లీ: రూ.1,59,440
చెన్నై: రూ.1,61,250
సూరత్: రూ.1,59,440
మధురై: రూ.1,61,250
కోయంబత్తూరు: రూ.1,61,250
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.