LOADING...
Groww Q4 Results: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. గ్రో షేర్‌తో భారీ లాభాలు
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. గ్రో షేర్‌తో భారీ లాభాలు

Groww Q4 Results: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. గ్రో షేర్‌తో భారీ లాభాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ గ్రో మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. నికర లాభం విషయానికి వస్తే, గతేడాదితో పోలిస్తే 122 శాతం పెరిగి రూ.686 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 87 శాతం వృద్ధితో రూ.1,505 కోట్లుగా నమోదైంది. అలాగే ఎబిటా (EBITDA) 142 శాతం పెరిగి రూ.939 కోట్లకు చేరింది. ఖర్చులను నియంత్రించుకుంటూనే ఆదాయాన్ని పెంచే 'ఆపరేటింగ్ లీవరేజ్' వ్యూహం కంపెనీకి బాగా ఉపయోగపడిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు

F&O ద్వారా భారీ ఆదాయం

మార్కెట్లో ఉన్న ఒడిదుడుకుల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 54.6 శాతానికి చేరింది. అదనంగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (MTF) వంటి కొత్త సేవలు కూడా గ్రో వృద్ధికి దోహదపడ్డాయి. ప్రస్తుతం గ్రో ప్లాట్‌ఫామ్ ద్వారా 2.16 కోట్ల మంది లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇందులో 1.67 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ విభాగంలో కూడా కంపెనీ మంచి ప్రగతి సాధించింది. కొత్త SIP రిజిస్ట్రేషన్లు 61.5 శాతం పెరిగాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.25,000 కోట్ల నికర పెట్టుబడులు మార్కెట్లోకి వచ్చాయి.

వివరాలు

ఇతర వ్యాపారాల్లో విస్తరణ

వినియోగదారుల మొత్తం ఆస్తుల విలువ 36 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం బ్రోకింగ్ సేవలకే పరిమితం కాకుండా, గ్రో తన క్రెడిట్ బిజినెస్‌ను కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం మొత్తం లాభాల్లో ఈ విభాగం వాటా 4.1 శాతంగా ఉంది. అయితే సబ్సిడరీ సంస్థలైన ఫిస్డం, అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాలు ఇంకా పెట్టుబడి దశలో ఉండటంతో తాత్కాలికంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఇవి కూడా లాభాల దిశగా పయనిస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement