LOADING...
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కంపెనీ మారినా ఈజీగా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్!
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కంపెనీ మారినా ఈజీగా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్!

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కంపెనీ మారినా ఈజీగా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈపీఎఫ్‌వో (EPFO) ఖాతాదారులకు తరచూ అనేక సందేహాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు మారడం సాధారణమైపోయింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు, పీఎఫ్‌ (PF) నిల్వలను కూడా కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే భవిష్యత్తులో డబ్బులను సులభంగా విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. కానీ చాలామంది ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్‌ సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ, పడే సమయం వంటి అంశాలను తెలుసుకుందాం.

వివరాలు

ఎంత సమయం పడుతుంది?

ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేయడానికి సాధారణంగా 7 నుంచి 20 రోజులు పడుతుంది. అయితే కేవైసీ పూర్తి కాకపోవడం, ప్రస్తుత కంపెనీ (ఎంప్లాయర్‌) ఆమోదంలో ఆలస్యం చేయడం వంటి కారణాల వల్ల మరింత సమయం పట్టే అవకాశముంది. అందువల్ల ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్‌ ఇచ్చిన తర్వాత మీ కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించి సమాచారం ఇవ్వడం మంచిది. దీని వల్ల ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

వివరాలు

ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ ఎలా ఉంటుంది?

ముందుగా ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యూఏఎన్ నెంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి హోమ్‌పేజీలో "ఆన్‌లైన్ సర్వీసెస్" ఎంపికను క్లిక్ చేయాలి "వన్ మెంబర్ - వన్ ఈపీఎఫ్ అకౌంట్" ఆప్షన్‌ను ఎంచుకోవాలి మీ వ్యక్తిగత వివరాలను ధృవీకరించుకోవాలి "గెట్ డీటైల్స్"పై క్లిక్ చేస్తే పాత కంపెనీ వివరాలు కనిపిస్తాయి పాత లేదా కొత్త కంపెనీ—ఏదో ఒకదాన్ని ఎంపిక చేయాలి మీ పీఎఫ్ ఐడీ, యూఏఎన్ నెంబర్ నమోదు చేయాలి "గెట్ ఓటీపీ"పై క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి చివరగా "సబ్మిట్"పై క్లిక్ చేస్తే రిక్వెస్ట్ పూర్తవుతుంది

Advertisement

వివరాలు

ఇవి తప్పనిసరిగా ఉండాలి

పీఎఫ్ ట్రాన్స్‌ఫర్‌ కోసం మీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్‌గా ఉండాలి. అదే విధంగా మొబైల్ నెంబర్‌కు యూఏఎన్ లింక్ అయి ఉండాలి. ఆధార్‌, బ్యాంక్ వివరాలు, పాత కంపెనీ ఎగ్జిట్ డేట్ వంటి వివరాలు నమోదు చేయాలి. అంతేకాక కేవైసీ వివరాలను ఎంప్లాయర్‌ ఆమోదించి ఉండాలి. స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత దాని స్థితిని కూడా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి లాగిన్ అయి "ఆన్‌లైన్ సర్వీసెస్" విభాగంలో "ట్రాక్ క్లెయిమ్ స్టేటస్"పై క్లిక్ చేయాలి. అక్కడ "పెండింగ్ విత్ ఎంప్లాయర్" అని కనిపిస్తే, మీ కంపెనీ యాజమాన్యం ఆమోదం కోసం పెండింగ్‌లో ఉందని అర్థం. ఎంప్లాయర్ ఆమోదం ఇచ్చిన వెంటనే ప్రక్రియ ముందుకు సాగుతుంది.

Advertisement