Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం
Govt hikes import duty : బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. బంగారం, వెండి, విలువైన లోహపు నాణేల దిగుమతిపై సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇందులో ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10శాతం కాగా.. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC) 5శాతం కావడం గమనార్హం. పెరిగిన సుంకాలు జనవరి 22 నుంచి అమలులోకి వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. విలువైన లోహాలను వెలికితీసేందుకు వినియోగించే ఉత్ప్రేరకాలపై సుంకాన్ని కూడా పెంచింది. 2023 బడ్జెట్‌లో వెండి, బంగారం, ప్లాటినం దిగుమతుల్లో సమతుల్య తీసుకురావడానికి ప్రభుత్వం వాటిపై దిగుమతి సుంకాన్ని పెంచింది. :