NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Trump tariff on India: ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న  భారత్‌..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Trump tariff on India: ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న  భారత్‌..!
    ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న భారత్‌..!

    Trump tariff on India: ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న  భారత్‌..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 03, 2025
    09:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలను ప్రకటించారు.

    భారతదేశంపై 26% టారిఫ్‌లు విధిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ ఇప్పటికే విశ్లేషణ ప్రారంభించింది.

    ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలియజేశారు. అయితే, ఈ సుంకాలను భారత్‌కు ఎదురుదెబ్బగా భావించడం లేదని పేర్కొన్నారు.

    వివరాలు 

    భారతదేశంపై ప్రభావం 

    "ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్‌ల ప్రభావం మన దేశంపై ఎంతవరకు ఉండొచ్చో వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. అయితే, ఇక్కడ ఒక పరిష్కార మార్గం ఉంది. అమెరికా వ్యక్తీకరించిన ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే, ఆ దేశంపై సుంకాలను తగ్గించేందుకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది. అందువల్ల ఇది మిశ్రమ ఫలితంగా భావించాలి తప్ప, భారత్‌కు తీవ్ర ఎదురుదెబ్బ కాదు" అని సదరు అధికారి వివరించారు.

    వివరాలు 

    సుంకాల అమలు 

    ట్రంప్‌ ప్రకటించిన 26% టారిఫ్‌లో, 10% సుంకం ఏప్రిల్‌ 5నుంచి అమల్లోకి వస్తుందని, మిగిలిన 16% ఏప్రిల్‌ 10 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు.

    సుంకాల ప్రకటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు.

    మోదీ తనకు మంచి స్నేహితుడని, అయితే భారత్‌ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు.

    భారత్‌ 52% సుంకాలను విధిస్తోందని, అందుకే తాము 26% టారిఫ్‌ విధిస్తున్నామని వెల్లడించారు.

    వివరాలు 

    ప్రకటన వివరాలు 

    భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు) వాషింగ్టన్‌ డీసీలో ట్రంప్‌ ఈ టారిఫ్‌ ప్రకటన చేశారు.

    ఈ రోజును 'లిబరేషన్‌ డే'గా ప్రకటించిన ఆయన, అన్ని దేశాలూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించవచ్చని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

    అంతేకాక, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై, ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు తెలిపారు.

    భారతదేశం తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, తాము 26% సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    భారతదేశం

    Bipin Rawat: 'మానవ తప్పిదం' కారణంగా 2021 ఛాపర్ క్రాష్ CDS బిపిన్ రావత్ మృతి: పార్ల్ ప్యానెల్ నివేదిక భారతదేశం
    Veer Bal Diwas: ఆ చిన్నారుల ధైర్యానికి గుర్తుగా వీర్ బాల్ దివస్ ప్రపంచం
    GST increase: జీఎస్టీ పెంపుతో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌పై పెరిగిన ఒత్తిడి జీఎస్టీ
    ICAI CA Final Results: సీఏ ఫైనల్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. ఇద్దరికీ ఫస్ట్‌ ర్యాంక్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025