Loading...
Lithium-ion battery: బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై కేంద్రం నిషేధం
బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై కేంద్రం నిషేధం

Lithium-ion battery: బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై కేంద్రం నిషేధం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన నిల్వ వ్యవస్థల వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఖనిజ సంపద దేశంలోనే అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందస్తుగా వర్గీకరించని (అన్‌సార్టెడ్) బ్యాటరీ వ్యర్థాలు, లిథియం-అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్ ద్వారా లభించే బ్లాక్ మాస్ ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

వివరాలు 

మారిన ఎగుమతి విధానం

గతంలో ఐటీసీ (హెచ్‌ఎస్) కోడ్ పరిధిలో ప్రాథమిక సెల్స్, ప్రైమరీ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ అక్యుములేటర్లు, వినియోగించిన బ్యాటరీల వ్యర్థాల ఎగుమతులకు అనుమతి ఉండేది.

వీటిని 'ఫ్రీ' (స్వేచ్ఛ) కేటగిరీలో చేర్చారు. అయితే తాజాగా ఈ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీసం (లెడ్‌), కాడ్మియం, పాదరసం లేని వర్గీకరించని బ్యాటరీ స్క్రాప్‌తో పాటు లిథియం-అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్‌ను నిషేధిత ఎగుమతుల జాబితాలో చేర్చింది.

దీంతో దేశీయ ఎగుమతిదారులు ఇకపై ఈ రకమైన బ్యాటరీ వ్యర్థాలను విదేశాలకు పంపేందుకు అనుమతి ఉండదు.

వివరాలు 

నిషేధానికి ప్రధాన కారణమిదే!

లిథియం-అయాన్ బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం ద్వారా లభించే బ్లాక్ మాస్‌లో లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన ఖనిజాలు ఉంటాయి.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధన నిల్వ వ్యవస్థల తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి.

అలాంటి విలువైన ఖనిజాలు కలిగిన బ్యాటరీ వ్యర్థాలు ఇతర దేశాలకు తరలిపోకుండా నిరోధించడమే తాజా నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.

భారత్‌ను గ్రీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ చర్య తీసుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

నిషేధానికి ప్రధాన కారణమిదే!

దేశంలో ఉత్పత్తి అయ్యే లేదా సేకరించే బ్యాటరీ వ్యర్థాలు ఇక్కడి రీసైక్లింగ్ పరిశ్రమలకే చేరేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

తద్వారా దేశీయంగా విలువైన ఖనిజాలను తిరిగి వెలికితీసి వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

అలాగే బ్యాటరీల పునర్వినియోగం, రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT