LOADING...
GST Collections: జూన్‌లో రూ.1.95 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. 14% వృద్ధి నమోదు
జూన్‌లో రూ.1.95 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. 14% వృద్ధి నమోదు

GST Collections: జూన్‌లో రూ.1.95 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. 14% వృద్ధి నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లకు సంబంధించిన గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. తాజా వివరాల ప్రకారం,జూన్ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే 14శాతం అధికంగా నమోదైంది. దేశీయ లావాదేవీల ద్వారా ప్రభుత్వం రూ.1.35 లక్షల కోట్ల మేర జీఎస్టీ ఆదాయాన్ని సమీకరించింది. మరోవైపు,దిగుమతులపై వసూలైన జీఎస్టీ 34.6 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.60 వేల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జూన్ నెలలో జీఎస్టీ రీఫండ్ల రూపంలో మొత్తం రూ.32,436 కోట్లు చెల్లించారు. ఈ రీఫండ్లను మినహాయించిన అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జూన్‌ నెలలో 14 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

Advertisement