
CareEdge Ratings: దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ర్యాంకులు.. ఆంధ్ర ర్యాంక్ ఎంతంటే?: కేర్‌ఎడ్జ్ రేటింగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వాటి పురోగతి, అలాగే ఆయా రాష్ట్రాల సొంత ఆదాయ వనరుల పరిస్థితి వంటి అంశాలపై కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ తాజా ర్యాంకులను ప్రకటించింది.
సొంత ఆదాయం..
దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకే బలమైన ఆదాయ వనరులు ఉన్నట్లు కేర్ ఎడ్జ్ నివేదిక పేర్కొంది.
ఆయా రాష్ట్రాల సొంత ఆదాయం (State Own Revenues - SOR) మొత్తం ఆదాయంలో 60% నుండి 80% వరకు ఉందని తెలిపింది.
దీంతో, వీటి రెవెన్యూ లోటు తక్కువగా ఉండటంతో అభివృద్ధి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే అవకాశం కలుగుతోంది.
వివరాలు
జీడీపీలో..
రాష్ట్రాల రెవెన్యూ లోటు తక్కువగా ఉన్నప్పటికీ, వాటి అప్పుల స్థాయి తక్కువగా ఉందని కేర్ ఎడ్జ్ పేర్కొంది.
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP)తో పోల్చుకుంటే, ఆయా రాష్ట్రాల అప్పుల నిష్పత్తి 16% నుంచి 27% మధ్య ఉందని నివేదిక తెలిపింది.
అలాగే, వడ్డీ చెల్లింపులు మొత్తం ఆదాయంలో సగటున 9% గా నమోదైనట్లు పేర్కొంది.
అగ్రస్థానంలో
రెవెన్యూ లోటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా ముందువరుసలో నిలిచాయి. వీటి సొంత ఆదాయం 60% నుండి 80% వరకు ఉండగా, రెవెన్యూతో పోల్చుకుంటే అప్పుల స్థాయి 24%గా నమోదైంది.
వివరాలు
రెవెన్యూతో పోల్చుకుంటే..
73% - 84% సొంత ఆదాయం ఉన్న రాష్ట్రాలు: హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్.
అయితే, వీటి రెవెన్యూతో పోల్చుకుంటే అప్పుల నిష్పత్తి 39% ఉంది.
47% - 62% సొంత ఆదాయం ఉన్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్. వీటి రెవెన్యూతో పోల్చుకుంటే అప్పుల స్థాయి 37%గా ఉంది.
మూలధన వ్యయం.. పన్నుల రాబడి
రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల ఆదాయం పెరుగుతున్నా,2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఖర్చును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేర్ ఎడ్జ్ నివేదిక సూచించింది.
వివరాలు
రాష్ట్రాలకు పన్నుల వాటా
7.5 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయ బడ్జెట్‌లో ఇప్పటివరకు 48% మాత్రమే వినియోగించారని నివేదిక వెల్లడించింది.
ఏప్రిల్ - డిసెంబర్ 2024 మధ్య టాప్ 15 రాష్ట్రాల మూలధన వ్యయం 3.57 లక్షల కోట్ల రూపాయలు, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 4% తక్కువ.
ఏప్రిల్ 2024 - జనవరి 2025 మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 10.74 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసిందని నివేదిక తెలిపింది.
ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 31% ఎక్కువ.కేంద్రం విడుదల చేసిన మొత్తం అభివృద్ధి ప్రాజెక్టులకు మరింత ఖర్చు పెట్టేందుకు ఉపయోగపడుతుందని వివరించింది.
వివరాలు
రాష్ట్రాలకు పన్నుల వాటా
పన్నుల ఆదాయ వృద్ధిపై అంచనా మొత్తం పన్నుల ఆదాయ పెరుగుదల 12% వరకూ ఉండొచ్చని అంచనా.
అయితే, కేంద్ర బడ్జెట్ అంచనా వేసిన 19% వృద్ధి కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
రాష్ట్రాల సొంత ఆదాయ వృద్ధి మందగించిన కారణంగా ఈ తక్కువ వృద్ధి నమోదవుతుందని విశ్లేషించారు.