LOADING...
NTR: సామ్రాజ్యం' ప్రోమోను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్

NTR: సామ్రాజ్యం' ప్రోమోను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

"నా కథను ఎన్టీఆర్‌తో తీయించండి.. ఆయనైతే అదరగొడతాడు!".. ఈ ఒక్క డైలాగ్‌తోనే ఓ తమిళ హీరో సినిమా ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విశేషమేమిటంటే, ఈ డైలాగ్ ఉన్న ఆ చిత్ర ప్రోమోను స్వయంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. కోలీవుడ్ స్టార్ శింబు, జాతీయ పురస్కార గ్రహీత దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అరసన్' చిత్రం. ఈ మూవీని తెలుగులో 'సామ్రాజ్యం' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

వివరాలు 

అద్భుతంగా అక్కటుకుంటున్న ప్రోమో  

సుమారు నాలుగు నిమిషాల నిడివి గల తెలుగు ఇంట్రో ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తూ, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రోమో ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతంగా ఆకట్టుకుంటోంది. హత్యకేసులో నిందితుడిగా కోర్టులో హాజరైన హీరో, ఒకవైపు అమాయకంగా ప్రవర్తిస్తూనే, మరోవైపు ముగ్గురిని దారుణంగా హతమార్చే సన్నివేశాలు సినిమాపై ఉత్సుకతను మరింత పెంచుతున్నాయి. అనిరుధ్ సమకూర్చిన నేపథ్య సంగీతం ప్రోమోకు అదనపు బలం చేకూర్చింది.

వివరాలు 

ప్రోమో చివర్లో హైలైట్ సీన్  

ఈ వీడియోలో 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కనిపించడం కూడా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా మారింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన హైలైట్ సీన్ మాత్రం ప్రోమో చివర్లోనే ఉంది. మీడియా సభ్యులు హీరోను ఆయన కథ గురించి అడగగా, శింబు చెప్పిన డైలాగ్ .. "నా కథను ఎవరి చేత తీయించాలి అనుకుంటున్నారు? ఎన్టీఆర్‌తో తీయించండి... కుమ్మేస్తాడు!".. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అనూహ్యమైన డైలాగ్‌తో ఎన్టీఆర్ అభిమానులు ఉత్సాహంతో నిండిపోయి, ప్రోమోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్