
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజులుగా లాభాల్లో ముగిశాయి. ఉదయం IT రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో సూచీలు తాత్కాలికంగా స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, కార్పొరేట్ ఫలితాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడుల రాక వంటి పాజిటివ్ అంశాలతో కాసేపటికే మళ్లీ పుంజుకొన్నాయి ఫలితంగా, సెన్సెక్స్ 84,172 వద్ద 52 వారాల అత్యధిక స్థాయిని అందించగా, నిఫ్టీ కూడా 25,781.50 వద్ద తన 52 వారాల గరిష్ఠాన్ని చేరింది. బ్యాంక్ నిఫ్టీ 57,828.30 వద్ద కొత్త రికార్డును సృష్టించింది.సెన్సెక్స్ ఉదయం 83,331.78 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 83,467.66) నష్టంతో ప్రారంభమైంది. కానీ క్రమంగా లాభాల్లోకి వచ్చి, రోజు మొత్తం లాభాలే కొనసాగాయి.
వివరాలు
రూపాయి-డాలర్ మారకం విలువ 87.82గా నమోదు
చివరగా 484.53 పాయింట్ల లాభంతో 83,952.19 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124.55 పాయింట్ల లాభంతో 25,709.85 వద్ద ముగిసింది. రూపాయి-డాలర్ మారకం విలువ 87.82 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 లో ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ ప్రధానంగా లాభపడ్డ షేర్లుగా కనిపించాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటెర్నల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టంలో కొనసాగాయి. అంతర్జాతీయంగా, బ్రెంట్ క్రూడ్ ధర 60.46 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతూ ఉంది, బంగారం ఔన్సు 4,338 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.