Page Loader
#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది
పెరిగిన రెపో రేట్లు కస్టమర్ల రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి

#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 08, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి? దేశంలోని బ్యాంకులకే బ్యాంకర్ ఆర్‌బీఐ. నిధుల కొరత ఉన్నప్పుడు లేదా నగదు నిల్వల నిష్పత్తి (CRR)కోసం బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుంటాయి. CRR అనేది లిక్విడ్ క్యాష్‌గా నిర్వహించాల్సిన బ్యాంక్ మొత్తం డిపాజిట్ల శాతం. ఆర్థిక భద్రత కోసం ఆర్‌బీఐ ఖాతాలో ఉంచుతాయి. బ్యాంకులు కస్టమర్లకు అందించే రుణాలపై వడ్డీని వసూలు చేస్తాయి. వాణిజ్య బ్యాంకులు తమ స్వల్పకాలిక ద్రవ్య అవసరాలకి ఆర్‌బీఐ నుండి డబ్బు తీసుకున్నప్పుడు, ఆర్‌బీఐ కూడా వడ్డీ వసూలు చేస్తుంది. ఈ రుణాలు ఇచ్చే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.

ఆర్‌బీఐ

రెపో రేటును పెంచినప్పుడు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి

ఆర్‌బీఐ రెపో రేటును పెంచినప్పుడు, బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుండి రుణం తీసుకోవడానికి ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా వారు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతారు. గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలు, తనఖాలు, క్రెడిట్ కార్డ్‌లు అన్నీ రెపో రేటు పెంపుతో ప్రభావితమవుతాయి. రుణ ఖర్చులు పెరగడం వల్ల సామాన్యులు అనవసరమైన కొనుగోళ్లు జోలికి వెళ్ళకుండా ఉంటారు. . పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నవారికి రెపో రేటు పెరుగుదలతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్లపై వడ్డీ కూడా పెరుగుతుంది. వినియోగదారులు ఎక్కువ ఆదా చేసినప్పుడు, అది మళ్లీ డిమాండ్‌ను తగ్గిస్తుంది. డిమాండ్ తగ్గినప్పుడు ధర కూడా తగ్గుతుంది. ఇది, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది.