రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. 2022 లో 5 సార్లు రేపో రేటును మార్చారు మే - 0.4 %, జూన్ 8 -0.5 %, ఆగస్టు 5 - 0.5%, సెప్టెంబర్ 30 - 0.5 %, డిసెంబర్ 7 - 0.35 %. 2023-24 నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి త్రైమాసికంలో 7.8%, రెండవ త్రైమాసికంలో 6.2%,మూడవ త్రైమాసికంలో 6%, నాల్గవ త్రైమాసికంలో 5.8%తో నిజమైన GDP వృద్ధి 6.4%గా అంచనా వేసామని దాస్ చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి ద్రవ్యోల్బణం 6.5%గా అంచనా
ప్రపంచ ఆర్థిక దృక్పథం కొన్ని నెలల క్రితం లాగా భయంకరంగా కనిపించడం లేదని, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని, అయితే ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం ఇప్పటికే లక్ష్యానికి మించి ఉందని ఆయన చెప్పారు. బలహీనమైన గ్లోబల్ డిమాండ్, ప్రస్తుత ఆర్థిక వాతావరణం దేశీయ వృద్ధికి ఆటంకమని దాస్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి ద్రవ్యోల్బణం 6.5%గా అంచనా వేసామని, 2023-24కి CPI ద్రవ్యోల్బణం 5.3%గా అంచనా వేస్తున్నామని దాస్ తెలిపారు.