voter list : ఓటరు జాబితాలో మీ పేరుందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఎన్నికల కమిషన్ (ECI) అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికల ప్రకటన చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఓటింగ్‌కు ముందుగా ప్రతి అర్హత గల ఓటరు తమ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. మొదటిసారి ఓటు వేయబోతున్నవారైనా,నివాసం మారినవారైనా తమ పేరు నమోదు అయ్యిందో లేదో ముందుగానే ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం voters' service portal ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.
వివరాలు
"వోటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్" డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
electoralsearch.eci.gov.in వెబ్‌సైట్ లేదా Voter Helpline యాప్ ద్వారా EPIC నంబర్, వ్యక్తిగత వివరాలు లేదా మొబైల్ నంబర్‌తో సెర్చ్ చేయొచ్చు. వివరాలు నమోదు చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి 'సెర్చ్'పై క్లిక్ చేస్తే మీ పోలింగ్ స్టేషన్, సీరియల్ నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి. అవసరమైతే "వోటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్" డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే, అది నమోదు కాకపోయి ఉండవచ్చు లేదా జాబితా నుంచి తొలగించి ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో వెంటనే BLOను సంప్రదించాలి లేదా 1950 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సహాయం పొందాలి అని అధికారులు సూచిస్తున్నారు.