New Aadhaar App: కొత్త ఆధార్ యాప్‌లో వేలిముద్రలు, ఐరిస్‌ను లాక్, అన్‌లాక్ ఎలా చేయాలంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఆధార్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కీలక వివరాలను వెల్లడించింది. జూలై 18న విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్త ఆధార్ యాప్‌ను ఇప్పటివరకు 4 కోట్ల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలాగే యాప్‌లో అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ ఫీచర్‌ను 1.91 కోట్లకుపైగా సార్లు వినియోగించారు. దీంతో వ్యక్తిగత గుర్తింపు సమాచార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా ఆధార్‌కు అనుసంధానమైన వేలిముద్రలు,ఐరిస్,ముఖ గుర్తింపు (ఫేస్ అథెంటికేషన్) వంటి బయోమెట్రిక్ వివరాలను వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా లాక్ చేయవచ్చు లేదా తాత్కాలికంగా అన్‌లాక్ చేయవచ్చు.
వివరాలు
బయోమెట్రిక్ లాక్ అంటే ఏమిటి?
దీంతో అనుమతి లేకుండా బయోమెట్రిక్ ఆధారంగా జరిగే ఆధార్ ధృవీకరణను అడ్డుకునే అవకాశం ఉంటుంది.
బయోమెట్రిక్ లాక్ అనేది ఆధార్‌లో నమోదైన వేలిముద్రలు, ఐరిస్, ముఖ గుర్తింపు వివరాలను భద్రపరిచే ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్.
ఒకసారి ఈ వివరాలను లాక్ చేస్తే, వాటిని ఉపయోగించి ఎలాంటి ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ జరగదు.
వినియోగదారు స్వయంగా అన్‌లాక్ చేసిన తర్వాత మాత్రమే బయోమెట్రిక్ ధృవీకరణ సాధ్యమవుతుంది.
ఈ సౌకర్యం ఆధార్‌తో మొబైల్ నంబర్ నమోదు చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
బయోమెట్రిక్స్ లాక్‌లో ఉన్న సమయంలో ఎవరైనా ఆధార్ నంబర్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణకు ప్రయత్నిస్తే, ఆ ప్రక్రియ విఫలమై 330 అనే ఎర్రర్ కోడ్ కనిపిస్తుంది.
వివరాలు
ఆధార్ యాప్‌లో బయోమెట్రిక్ లాక్ చేసే విధానం
ఆధార్ యాప్‌ను ఓపెన్ చేసి 6 అంకెల పిన్‌తో లాగిన్ అవ్వాలి.
హోమ్ స్క్రీన్‌లో ఆధార్ కార్డు కింద కనిపించే Biometric Lock/Unlock ఎంపికపై ట్యాప్ చేయాలి.
వివరాలను లాక్ చేయడానికి నిర్ధారించాలి.
మళ్లీ అవసరమైనప్పుడు అదే ఎంపికపై ట్యాప్ చేసి అన్‌లాక్ చేయవచ్చు.
వివారాలు
మరో మార్గం కూడా ఉంది
ఆధార్ యాప్‌లో లాగిన్ అవ్వాలి.
హోమ్ స్క్రీన్‌లో Security విభాగానికి వెళ్లాలి.
అక్కడ Biometric Lock/Unlock ఎంపికను ఎంచుకోవాలి.
లాక్ చేయడానికి నిర్ధారించాలి.
బయోమెట్రిక్ ధృవీకరణ అవసరమైనప్పుడు అదే విధంగా వెళ్లి అన్‌లాక్ చేయాలి.
వివరాలు
ఈ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుంది?
ప్రస్తుతం అనేక ఆధార్ ఆధారిత సేవల్లో బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బయోమెట్రిక్ లాక్ ఫీచర్‌ను ఉపయోగించడం వల్ల మీ అనుమతి లేకుండా వేలిముద్రలు, ఐరిస్ లేదా ముఖ గుర్తింపు ద్వారా ఎవరూ ఆధార్ ధృవీకరణ చేయలేరు.
దీంతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకారం,ఈ ఫీచర్ ద్వారా ఆధార్ వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణ పొందడంతో పాటు, అవసరమైనప్పుడు కొన్ని ట్యాప్‌లతోనే బయోమెట్రిక్స్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. తాజా వివరాల కోసం అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను పరిశీలించండి.