Page Loader
Gold bonds: పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!
పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!

Gold bonds: పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 03, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎనిమిది సంవత్సరాల క్రితం సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభం కలిగింది. 2017 మేలో ఆర్‌ బి ఐ ద్వారా జారీ చేసిన పసిడి బాండ్లకు సంబంధించి రిడెంప్షన్‌ తేదీని తాజాగా ప్రకటించింది. మే 9ని మెచ్యూర్‌ తేదీగా నిర్ణయించారు. దీని వల్ల అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారు ఇప్పుడు దాదాపు మూడింతలు లాభం పొందబోతున్నారు, అంటే వారు రూ.3 లక్షలు పొందగలుగుతారు. ఇందులో వడ్డీ కూడా కలిసిఉంటుంది. 2015 నవంబరులో దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ బాండ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు.

Details

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.50శాతం డిస్కౌంట్‌

2017 మేలో 2017-18 సిరీస్‌ 1 పసిడి బాండ్లు జారీ చేయబడగా, ఆ సమయంలో 999 స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారం ధర రూ.2,951గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్‌ ఇవ్వబడింది. ఇప్పటికే ఆర్‌బీఐ వారు నిర్ణయించిన మెచ్యూరిటీ ధర రూ.9,486గా ఉంది. ఆ సమయంలో1 లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారికి ఇప్పుడు రూ.3 లక్షలు పొందే అవకాశం ఉంది. దీనిపై పసిడి బాండ్లపై ఇచ్చే వడ్డీ కూడా అదనంగా ఉంటుంది. ఏటా 2.50% నామమాత్ర వడ్డీని ఈబాండ్లకు అందజేస్తారు. రిడెంప్షన్‌ తేదీకి ముందు వారం 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి భారత బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు.

Details

2015-16లో బాండ్ల జారీ

ఈసారి ధరను రూ.9,486గా నిర్ణయించారు. ఇటీవల పసిడి ధరలు రూ.1 లక్ష మార్కు దాటిన సందర్భంలో పసిడి బాండ్ల రిడెంప్షన్‌ మళ్లీ మదుపర్లకు గొప్ప అవకాశమని చెప్పవచ్చు. ఈ బాండ్లపై వచ్చిన మొత్తం నుంచి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2015-16 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేసింది. చివరగా 2024 ఫిబ్రవరి 12-16 మధ్య సబ్‌స్క్రిప్షన్‌ కోసం అవకాశం ఇచ్చింది, కానీ ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయకుండా ప్రభుత్వం నిర్ణయించింది.