LOADING...
FASTag: ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు భారీ స్పందన.. ఆరు నెలల్లోనే 50 లక్షలు
ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు భారీ స్పందన.. ఆరు నెలల్లోనే 50 లక్షలు

FASTag: ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు భారీ స్పందన.. ఆరు నెలల్లోనే 50 లక్షలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ల సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. ఈ సదుపాయాన్ని ప్రారంభించిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ పాస్‌ల ద్వారా మొత్తం 26.55 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోజువారీగా టోల్‌గేట్‌ల మీదుగా రాకపోకలు సాగించే వ్యక్తిగత వాహనాల యజమానులపై భారం తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 15న ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఒక్కసారి రూ.3,000 చెల్లిస్తే, ఏడాది కాలంలో జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల ద్వారా 200 సార్లు ప్రయాణించే అవకాశం ఈ పాస్‌ ద్వారా లభిస్తుంది.

Details

మొదటి స్థానంలో చండీగఢ్

ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ లావాదేవీల్లో చండీగఢ్‌ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం లావాదేవీల్లో ఈ రాష్ట్ర వాటా 14 శాతంగా నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు 12.3 శాతం, దిల్లీ 11.5 శాతం వాటాతో నిలిచాయి. అదే సమయంలో దిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలోని బిజ్వాసన్‌ ఫీ ప్లాజ్‌ వద్ద అత్యధిక ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ లావాదేవీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement