Loading...
Hyderabad Airport: 2031 నాటికి 5 కోట్ల ప్రయాణికుల లక్ష్యం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మెగా అప్‌గ్రేడ్
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మెగా అప్‌గ్రేడ్

Hyderabad Airport: 2031 నాటికి 5 కోట్ల ప్రయాణికుల లక్ష్యం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మెగా అప్‌గ్రేడ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే అత్యుత్తమ విమానయాన కేంద్రంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) భారీ ప్రణాళికలను రూపొందిస్తోంది. రాబోయే అయిదేళ్లలో, అంటే 2031 సెప్టెంబరు నాటికి విమానాశ్రయ వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని 5 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) నుంచి తుది అనుమతులు వచ్చిన వెంటనే రూ.10,000 కోట్లకు పైగా మూలధన వ్యయంతో విస్తరణ పనులను చేపట్టనుంది.

వివరాలు 

3.7 నుంచి 4 కోట్లకు

ప్రస్తుతం టెర్మినల్‌ వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 3.4 కోట్లుగా ఉండగా, దీన్ని 3.7 నుంచి 4 కోట్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

అలాగే రెండో టెర్మినల్‌ నిర్మాణం, అదనంగా మరో రన్‌వే ఏర్పాటు, రెండు రన్‌వేలను అనుసంధానించే క్రాస్‌ ట్యాక్సీవేల నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు కూడా ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.

ఈ విషయాన్ని సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

దేశీయ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున కొత్త విమానాలను కొనుగోలు చేస్తుండటంతో, ప్రస్తుతం ఉన్న 100 పార్కింగ్‌ స్టాండ్‌ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేయాలని జీహెచ్‌ఐఏఎల్‌ నిర్ణయించింది.

ఇప్పటికే 10 పార్కింగ్‌ స్టాండ్‌ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఉత్తర టెర్మినల్‌ విస్తరణ పూర్తయ్యాక మరో 10 స్టాండ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

వివరాలు 

విస్తరణతో 4 లక్షల నుంచి 6 లక్షల మందికి ఉపాధి

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) తాజా నివేదిక ప్రకారం తెలంగాణ స్థూల విలువ జోడింపులో హైదరాబాద్‌ విమానాశ్రయం వాటా దాదాపు 5 శాతంగా ఉంది.

ప్రస్తుతం ఈ విమానాశ్రయ కార్యకలాపాల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షలకు పైగా ప్రజలు ఉపాధి పొందుతున్నారు.

ప్రతిపాదిత విస్తరణ పూర్తయితే 2038 నాటికి ఈ సంఖ్య 6 లక్షలకు మించి చేరే అవకాశముందని నివేదిక అంచనా వేసింది.

అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.2 లక్షల కోట్ల అదనపు ఆర్థిక విలువ సమకూరే అవకాశముందని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

కనెక్టింగ్‌ ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు

శంషాబాద్‌ విమానాశ్రయాన్ని వినియోగించే ప్రయాణికుల్లో 27 నుంచి 30 శాతం మంది కనెక్టింగ్‌ ప్రయాణికులే.

వీరు దేశంలోని వివిధ నగరాల నుంచి హైదరాబాద్‌కు చేరుకుని, ఇక్కడి నుంచి దుబాయ్‌, లండన్‌ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణిస్తున్నారు.

ఇలాంటి ప్రయాణికుల సౌకర్యం కోసం డొమెస్టిక్‌-టు-డొమెస్టిక్‌ (డీ2డీ), డొమెస్టిక్‌-టు-ఇంటర్నేషనల్‌ (డీ2ఐ) ప్రత్యేక కనెక్టింగ్‌ మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.

ఇవి మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్నాయి.

దీంతో ప్రయాణికులు టెర్మినల్‌ వెలుపలికి రావాల్సిన అవసరం లేకుండా కేవలం ఐదు నిమిషాల్లోనే నేరుగా అంతర్జాతీయ టెర్మినల్‌కు చేరుకునే అవకాశం కలుగుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

పెరుగుతున్న ప్రైవేట్‌ జెట్‌ల రాకపోకలు

దిల్లీ-ఎన్‌సీఆర్‌ తర్వాత అత్యధిక హై నెట్‌వర్త్‌ వ్యక్తులు(హెచ్‌ఎన్‌ఐలు)ఉన్ననగరంగా హైదరాబాద్‌ నిలవడంతో ప్రైవేట్‌ జెట్‌ల రాకపోకలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల క్రితమే అత్యాధునిక సదుపాయాలతో జనరల్‌ ఏవియేషన్‌ టెర్మినల్‌ను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ టెర్మినల్‌ ద్వారా రోజుకు సగటున 10 నుంచి 20ప్రైవేట్‌ జెట్‌ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

అదే సమయంలో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ఎగుమతి అయ్యే కార్గోలో దాదాపు 60శాతం ఫార్మా ఉత్పత్తులే ఉండటంతో,కోల్డ్‌ చైన్‌ నిల్వ సామర్థ్యాన్ని 50వేల టన్నుల నుంచి లక్ష టన్నులకు పెంచుతున్నారు.

దేశీయ కార్గో రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో లక్ష టన్నుల సామర్థ్యంతో ప్రత్యేక కార్గో టెర్మినల్‌ను నిర్మించేందుకు కూడా సంస్థ చర్యలు చేపడుతోంది.

ADVERTISEMENT