Page Loader
Hyundai IPO: హ్యుందాయ్‌ మోటార్స్‌ షేర్లు 1% నష్టంతో లిస్ట్ అయినట్లే!
హ్యుందాయ్‌ మోటార్స్‌ షేర్లు 1% నష్టంతో లిస్ట్ అయినట్లే!

Hyundai IPO: హ్యుందాయ్‌ మోటార్స్‌ షేర్లు 1% నష్టంతో లిస్ట్ అయినట్లే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2024
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా అనుబంధ సంస్థగా హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఇవాళ మార్కెట్‌లో తన ఐపీఓ (IPO) షేర్లను నమోదుచేసింది. మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1 శాతం డిస్కౌంట్‌తో ప్రారంభమైంది. ఇక హ్యుందాయ్ మోటార్స్‌ ఐపీఓకి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 17న ముగిసింది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించారు.

Details

నష్టపోయిన ఇన్వెస్టర్లు

ఎల్‌ఐసీ (LIC) ఐపీఓను (రూ.21వేల కోట్లు) అధిగమించిన హ్యుందాయ్ మోటార్స్, గరిష్ట ధరల శ్రేణి వద్ద రూ.27,870 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ కంపెనీ ఇష్యూ ధర రూ.1,960 కాగా, బీఎస్‌ఈలో 1.48 శాతం డిస్కౌంట్‌తో రూ.1,931 వద్ద లిస్టయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ 1.33 శాతం డిస్కౌంట్‌తో రూ.1,934 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. దీంతో ఇన్వెస్టర్లు దాదాపు 1 శాతం నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.