Page Loader
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 5శాతానికి పెంచుకున్న ఐహెచ్‌సీ 
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 5శాతానికి పెంచుకున్న ఐహెచ్‌సీ

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 5శాతానికి పెంచుకున్న ఐహెచ్‌సీ 

వ్రాసిన వారు Stalin
Oct 04, 2023
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో తన వాటాను 5శాతానికి పైగా పెంచుకుంది. యూఏఈ ఆధారిత కంపెనీ అయిన ఐహెచ్‌సీ అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో తన మొత్తం హోల్డింగ్‌ను విక్రయించిన వారం తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో తన వాటాను పెంచుకోవడం గమనార్హం. ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రపంచ-ప్రధాన ఇంక్యుబేషన్ మోడల్‌పై ఐహెచ్‌సీ తన విశ్వాసం వ్యక్తం చేసింది. విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి కీలక రంగాలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ బలమైన ఉనికిని ఐహెచ్‌సీ పేర్కొంది. అదానీ కంపెనీలో తన వాటాను పెంచుకోవడం ద్వారా భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించుకోవచ్చని ఐహెచ్‌సీ భావిస్తోంది.

అదానీ

కొత్తగా 0.06శాతం వాటా కొనుగోలు

ఐహెచ్‌సీకి చెందిన గ్రీన్ వైటాలిటీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్, అనుబంధ సంస్థలైన గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్, గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్ 0.06శాతం కొత్తగా వాటాను కొనుగోలు చేశాయి. దీంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఐహెచ్‌సీ కంపెనీ ఉమ్మడి వాటా 5.04శాతానికి చేరుకుంది. ఈ లావాదేవీ బహిరంగ మార్కెట్ ఒప్పందాల ద్వారా జరిగినట్లు తన ఫైలింగ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది. ఐహెచ్‌సీ తన పెట్టుబడిని పెంచుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐహెచ్‌సీ తాజా పెట్టుబడి, స్థిరమైన మౌలిక సదుపాయాల్లో, ప్రపంచ విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో, సమానమైన ఇంధన పరివర్తనలో ప్రపంచ మార్కెట్‌లో ఏఈఎల్ అత్యత్తమ స్థితిని తెలియజేస్తుందని వెల్లడించింది.