
Small savings schemes: కేంద్రం 'న్యూ ఇయర్' కానుక.. సుకన్య సమృద్ధి యోజనపై భారీగా వడ్డీ పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
న్యూ ఇయర్ కానుకగా.. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది.
2023-24ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి) సుకన్య సమృద్ధి ఖాతా యోజన, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై ప్రభుత్వం వడ్డీ రేటును 0.20% పెంచింది.
సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్లపై వడ్డీ రేటును ప్రస్తుతమున్న 8శాతం నుంచి 8.2శాతానికి కేంద్రం పెంచింది.
మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న 7శాతం నుంచి 7.1%కి పెంచింది.
పీపీఎఫ్‌లపై వడ్డీ రేటు 7.1శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త వడ్డీ రేట్లు జనవరి 1, 2024 నుంచి వర్తిస్తాయి.
కేంద్రం
పెంచిన తర్వాత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి
సుకన్య సమృద్ధి ఖాతా పథకం- 8.2%
సేవింగ్స్ డిపాజిట్ - 4% 1
సంవత్సరం టైమ్ డిపాజిట్-6.9%
2 సంవత్సరాల కాల డిపాజిట్-7%
3 సంవత్సరాల కాల డిపాజిట్-7.1%
5 సంవత్సరాల కాల డిపాజిట్-7.5%
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్-6.7%
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-8.2%
నెలవారీ ఆదాయ ఖాతా పథకం-7.4%
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్-7.7%
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్-7.1%
కిసాన్ వికాస్ పత్ర-7.5%
ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో ప్రధానంగా పోస్టాఫీసుల ద్వారా నిర్వహించబడే చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తెలియజేస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ మే 2022 నుంచి పాలసీ రేటును 2.5శాతం నుండి 6.5%కి పెంచింది. దీని కారణంగా బ్యాంకులు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచవలసి వచ్చింది.