Loading...
ITR Refund: పన్ను రిఫండ్‌ ఇంకా రాలేదా? ఆలస్యానికి ఈ కారణాలు ఉండొచ్చు.. ఇలా చెక్‌ చేయండి
పన్ను రిఫండ్‌ ఇంకా రాలేదా? ఆలస్యానికి ఈ కారణాలు ఉండొచ్చు.. ఇలా చెక్‌ చేయండి

ITR Refund: పన్ను రిఫండ్‌ ఇంకా రాలేదా? ఆలస్యానికి ఈ కారణాలు ఉండొచ్చు.. ఇలా చెక్‌ చేయండి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన తర్వాత రిఫండ్‌ కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపుదారులు చాలామందే ఉన్నారు. కొందరికి రిటర్నులు దాఖలు చేసిన కొద్ది గంటల్లోనే రిఫండ్‌ జమవుతుండగా.. మరికొందరు మాత్రం వారాలు గడిచినా డబ్బులు అందలేదని సామాజిక మాధ్యమాల్లో చెబుతున్నారు. కొంతమంది తమ రిఫండ్‌ స్టేటస్‌ ఇప్పటికీ 'అండర్‌ ప్రాసెస్‌'గా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. అసలు రిఫండ్‌ ఆలస్యం కావడానికి కారణాలేంటి? స్టేటస్‌ను ఎలా తెలుసుకోవాలి?

వివరాలు 

ఆలస్యానికి కారణాలు ఇవే..

ఐటీఆర్‌ దాఖలు చేయడం మాత్రమే సరిపోదు.దాన్ని ఇ-వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేయాలి.

ఇ-వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాతే ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ను ప్రాసెస్‌ చేస్తుంది.

ఐటీఆర్‌ దాఖలు చేసిన తేదీ నుంచి 30రోజుల్లోగా ఇ-వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి.కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిందో లేదో ముందుగా పరిశీలించాలి.

బ్యాంక్‌ ఖాతాను ప్రీ-వాలిడేట్‌ చేయకపోయినా రిఫండ్‌ జాప్యం కావచ్చు. అందువల్ల ఆదాయపు పన్ను పోర్టల్‌లో మీ బ్యాంక్‌ ఖాతా వ్యాలిడేట్‌ అయిందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలి.

అలాగే బ్యాంక్‌ ఖాతాలో నమోదైన పేరు,పాన్‌లో ఉన్న వివరాలు సరిపోలకపోయినా రిఫండ్‌ జారీ కాకపోవచ్చు.

ఐటీఆర్‌లో పేర్కొన్న బ్యాంక్‌ ఖాతా మూసివేసి ఉండటం లేదా తప్పు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ నమోదు చేయడం కూడా రిఫండ్‌ రాకపోవడానికి కారణమవుతుంది.

వివరాలు 

ఆలస్యానికి కారణాలు ఇవే..

పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా రిఫండ్‌ విషయంలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో పోర్టల్‌లో ఎర్రర్‌ మెసేజ్‌ కనిపించి,పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని సూచించవచ్చు.

ఐటీఆర్‌ ఫైలింగ్‌లో చేసిన పొరపాట్లు కూడా రిఫండ్‌ ఆలస్యానికి కారణం కావచ్చు. ముఖ్యంగా ఆదాయం, వడ్డీ వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం సమస్యకు దారితీయొచ్చు. అదేవిధంగా ఏఐఎస్‌ (AIS), 26ఏఎస్‌, టీడీఎస్‌ సర్టిఫికెట్లలో ఉన్న వివరాలను ఐటీఆర్‌లో సరిగా చూపించకపోయినా రిటర్న్‌ ప్రాసెసింగ్‌ ఆలస్యం కావచ్చు.

సాధారణంగా పెద్ద మొత్తంలో రిఫండ్‌ ఇవ్వాల్సిన సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ మరిన్ని వివరాలను తనిఖీ చేస్తుంది. కొన్ని రిటర్నులను రిస్క్‌ ఆధారిత ధ్రువీకరణ కోసం కూడా పంపించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

రిఫండ్‌ స్టేటస్‌ ఎలా చెక్‌ చేయాలి?

దీంతోనూ రిఫండ్‌ జారీ కావడానికి అదనపు సమయం పట్టొచ్చు.

మీ రిఫండ్‌ పరిస్థితిని తెలుసుకోవాలంటే ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి. పాన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలతో www.incometax.gov.inలోకి ప్రవేశించాలి.

ఆ తర్వాత టాప్‌ మెనూలోని 'ఇ-ఫైలింగ్‌' విభాగంలోకి వెళ్లాలి. అక్కడ 'ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌'ను ఎంచుకుని 'వ్యూ ఫైల్డ్‌ రిటర్న్స్‌'పై క్లిక్‌ చేయాలి. అక్కడ మీ రిఫండ్‌ స్టేటస్‌ కనిపిస్తుంది.

అసెస్‌మెంట్‌ ఇయర్‌ ఆధారంగా రిఫండ్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించవచ్చు. రిటర్న్‌ను ఎప్పుడు సబ్మిట్‌ చేశారు? ఇ-వెరిఫికేషన్‌ ఎప్పుడు పూర్తయింది? రిటర్న్‌ ప్రాసెస్‌ కావడానికి ఎంత సమయం పట్టింది? రిఫండ్‌ ఎప్పుడు జారీ చేశారు? వంటి వివరాలు కూడా అక్కడే కనిపిస్తాయి.

ADVERTISEMENT