Page Loader
IPO: ఐపీఓ లిస్టింగ్‌లో భారత్ టాప్; ఈ ఏడాది 80లాంచ్‌లతో అదరగొట్టిన బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ 
ఐపీఓ లిస్టింగ్‌లో భారత్ టాప్; ఈ ఏడాది 80లాంచ్‌లతో అదరగొట్టిన బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ

IPO: ఐపీఓ లిస్టింగ్‌లో భారత్ టాప్; ఈ ఏడాది 80లాంచ్‌లతో అదరగొట్టిన బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ 

వ్రాసిన వారు Stalin
Jul 18, 2023
06:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఓల లిస్టింగ్‌లలో భారత్‌కు చెందిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) సత్తా చాటాయి. గ్లోబల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ర్యాంకింగ్స్‌లో బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. ప్రపంచ ఆర్థిక మందగమనాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా, భారతీయ ఎక్స్ఛేంజీలు ఈ సంవత్సరం ఇప్పటివరకు 80 ఐపీఓలను లాంచ్ చేశాయి. ఇది గత సంవత్సరం కంటే 33శాతం ఎక్కువని చెప్పాలి. గతేడాది బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ ఎక్స్ఛేంజీలు 60 ఐపీఓలను మాత్రమే లాంచ్ చేశాయి. ఈ సారి లిస్టింగుల్లో మెజార్టీ భాగం ఎస్‌ఎంఈలకు సంబంధించిన ఐపీఓలే ఉన్నాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక చెబుతోంది.

ఐపీఓ

గ్లోబల్ ఐపీఓల్లో భారత్ వాటా గణనీయంగా వృద్ధి

ఐపీఓల ద్వారా ఈ సంవత్సరం మొత్తం 2.1 బిలియన్ డాలర్లను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) సేకరించాయి. ఈ ఏడాది వచ్చిన చాలా ఐపీఓలు పారిశ్రామిక, ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాలకు సంబంధించినవే కావడం గమనార్హం. భారత్‌లో కొత్త ఐపీఓలకు మంచి ఆదరణ ఉంది. గ్లోబల్ ఐపీఓల్లో భారత్ వాటా నిరంతరం పెరుగుతోంది. 2021 సంవత్సరంలో గ్లోబల్ ఐపీఓల్లో భారత్ వాటా 6శాతం కాగా, 2022లో 22కి పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం అంటే 2023లో ఈ వాటా 13శాతం పెరగడం గమనార్హం.